డ్రైవర్ ను తిట్టిన కలెక్టర్ పై వేటు

అయితే, మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ కలెక్టర్ కన్యాల్ మాత్రం ఓ ట్రక్ డ్రైవర్ స్థాయిని ప్రశ్నించి విమర్శల పాలయ్యారు. దీంతో, ఆ కలెక్టర్ పై సీఎం మోహన్ యాదవ్ సస్పెండ్ చేసిన వైనం ఇపుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

Update: 2024-01-04 00:30 GMT

ప్రజలకు..ప్రత్యేకించి సామాన్యులకు సేవ చేసేందుకు తాము ఐఏఎస్ అయ్యామని చాలామంది చెబుతుంటారు. వాస్తవానికి చాలా ప్రభుత్వ పథకాలను రూపొందించేంది కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులే. అంతటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బ్యూరోక్రాట్లు...ప్రజలతో ఆచితూచి మాట్లాడాలి. అయితే, మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ కలెక్టర్ కన్యాల్ మాత్రం ఓ ట్రక్ డ్రైవర్ స్థాయిని ప్రశ్నించి విమర్శల పాలయ్యారు. దీంతో, ఆ కలెక్టర్ పై సీఎం మోహన్ యాదవ్ సస్పెండ్ చేసిన వైనం ఇపుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

హిట్ అండ్ రన్ కొత్త చట్టం నేపథ్యంలో మధ్య ప్రదేశ్ లో ట్రక్ డ్రైవర్ల సంఘం నాయకులతో కలెక్టర్ కన్వాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డ్రైవర్ల గురించి కాస్త మంచిగా మాట్లాడండి అంటూ వారి సంఘం ప్రతినిధి కలెక్టర్ తో అన్నారు. దీంతో, "క్యా కరేగే తుమ్.. క్యా ఔకత్ హై తుమ్హారీ(ఏం చేయగలవు నువ్వు..నీ స్థాయెంత?)" అని కన్వల్ బెదిరిస్తూ మాట్లాడారు అయితే, తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలంటూ సమావేశం చివరలో ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయినా సరే అప్పటికే డ్యామేజీ జరిగి ఆ వీడియో వైరల్ అయింది.

దీంతో సదరు కలెక్టర్ పై సీఎం మోహన్ యాదవ్ చర్యలు తీసుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి భాషను సహించబోమని హెచ్చరిస్తూ కలెక్టర్ కన్యాల్ ను రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేశారు. షాజాపూర్ కొత్త కలెక్టర్ గా నర్సింగ్ పూర్ కలెక్టర్ రిజు బఫ్నాను నియమించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని, ఎంత పెద్ద అధికారి అయినా పేదల పనిని , మనోభావాలను గౌరవించాలని చెప్పారు.

Tags:    

Similar News