శంతను నాయుడికి రుణమాఫీ... రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర విషయాలు!

తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సంతను నాయుడు గురించి కూడా తన వీలునామాలో పేర్కొన్నారు రతన్ టాటా. శంతను నాయుడు స్టార్టప్ "ఫుడ్ ఫెలోస్"లో రతన్ జీ వాటా ఇప్పుడు లిక్విడ్ అయ్యింది.

Update: 2024-10-26 05:39 GMT

ప్రముఖ దివంగత పారిశ్రామిక దిగ్గజం, భారతరత్నం, పరోపకారి రతన్ టాటా రాసిన వీలునామా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మానవతామూర్తిగా, జంతు ప్రేమికుడిగా ఆయన ప్రపంచస్థాయిలో ఖ్యాతి సంపాదించారు. ఈ సమయంలో ఆయన రాసిన వీలునామాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అవును.. ఈ నెల 9వ తేదీనా ముంబై లోని ఓ ఆసుపత్రిలో 86 ఏళ్ల వయసులో రతన్ టాటా మరణించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... బ్రతికి ఉన్నంత కాలం పరోపకారానికి పెద్ద పీట వేసుకుంటూ గడిపిన ఆయన.. తన మరణానంతరం అమలులోకి వచ్చే వీలునామాలోనూ దాతృత్వానికి నిదర్శనంగా నిలిచారు.

ఇందులో భాగంగా... తన మారణానంతరం రూ.10వేల కోట్లకు పైగా ఆస్తులను పంచినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం... పెంపుడు శునకం జర్మన్ షెపర్డ్ "టిటో" కొసం కొంత వాటాను కేటాయించారు రతన్ టాటా! ఈ శునకం యొక్క జీవితకాల సంరక్షణ కోసం ఆ వాటాను కేటాయించినట్లు చెబుతున్నారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం... రతన్ టాటా చిరకాల కుక్ రాజన్ షా.. టిటో బాధ్యతలు చూసుకుంటారు. ఇదే సమయంలో... టాటా ఫౌండేషన్, తన సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణులు షిరీన్, జీనా జీజాభోయ్ లతోపాటు హౌస్ సిబ్బంది, ఇతరులకు ఆస్తులను కేటాయించినట్లు చెబుతున్నారు.

శంతను నాయుడికి రుణమాఫీ!

తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సంతను నాయుడు గురించి కూడా తన వీలునామాలో పేర్కొన్నారు రతన్ టాటా. శంతను నాయుడు స్టార్టప్ "ఫుడ్ ఫెలోస్"లో రతన్ జీ వాటా ఇప్పుడు లిక్విడ్ అయ్యింది. ఇదే సమయంలో... శంతను నాయుడు విదేశాల్లో చదువుకోసం ఇచ్చిన రుణాన్ని కూడా రతన్ టాటా మాఫీ చేశారు.

ఈ సమయంలో... రతన్ టాటా అంతిమ కోరికలను నెరవేర్చేందుకు ఆయన సవతి సోదరీమణులు షిరీన్, డీన్నా జెజీబోయ్, దీర్ఘకాల సహచరుడు మెహ్లీ మిస్త్రీ లతోపాటు న్యాయవాది డారియస్ ఖంబటను కార్యనిర్వాహకులుగా నియమించారు. సైరస్ మిస్త్రీకి సోదరుడు అయిన మెహ్లీ మిస్త్రీ.. రతన్ టాటాకు నమ్మకస్తుడిగా ఉండేవారు!

Tags:    

Similar News