జగన్ చొరవ... ఉచితంగా రూ.16 కోట్ల ఇంజక్షన్!
అవును... శనివారం నిడదవోలు పర్యటన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ని చిన్నారి శాంతి కుటుంబం కలిసింది.
సీఎం వైఎస్ జగన్ చొరవతో ఓ చిన్నారికి రూ.16 కోట్ల ఇంజక్షన్ ఉచితంగా ఇచ్చేందుకు ఎయిమ్స్ సంసిద్ధత తెలిపింది. ఎనిమిది నెలల కిందట తన బిడ్డతో సాయం కోసం వచ్చిన ఓ ఆడపడుచు ముఖంలో చిరునవ్వు పూయించేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం నిడదవోలు పర్యటన సందర్భంగా జగన్ ని ఆ కుటుంబం కలిసింది.
సామాన్యుడు ధైర్యంగా బ్రతకగలగడమే నిజమైన సంక్షేమం అని నమ్ముతారో ఏమో కానీ... సామన్యుల విషయంలో పలు సందర్భాల్లో జగన్ రియాక్షన్ వైరల్ గా ఉంటుంది. కాన్వాయ్ ని రోడ్డుపై ఆపి మరీ జగన్ రియాక్ట్ అవుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదే క్రమంలో 8 నెలల క్రితం తన కుమార్తె ఆరోగ్యం కోసం తనను ని కలిసిన ఒక తల్లిని జగన్ పరామర్శించారు.
అవును... శనివారం నిడదవోలు పర్యటన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ని చిన్నారి శాంతి కుటుంబం కలిసింది. ఈ సందర్భంగా పాప ఆరోగ్యం కోసం వాకబు చేశారు జగన్. ఈ సమయంలో పాప వైద్యం వివరాలన్నింటి కలెక్టర్ మాధవీలత వివరించారు.
వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాయని, రక్త నమూనా కోసం శాంతిని ఆరుసార్లు ఢిల్లీకి పంపామని.. అనంతరం, జెనెటిక్స్ పరీక్ష కోసం రక్త నమూనాలను నొవార్టిస్ కంపెనీ సింగపూర్, అమెరికాకు పంపినట్లు కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలన్నింటిలో సానుకూల ఫలితాలు రావడంతో.. మూడు వారాల్లో పాప కోసం ఇంజెక్షన్ (రూ. 16 కోట్ల ఖరీదు చేసేది) వచ్చే అవకాశం ఉందని ఆమె వివరించారు.
కాగా... నిడదవోలు మండలం శెట్టిపేటకు చెందిన చెట్టే సూర్యకుమారి కుమార్తె డయానా శాంతి.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్-2 అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. తన కుమార్తె వైద్యానికి ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం కోరుతూ తల్లి సూర్యకుమారి జనవరి 3న జిల్లాకు వచ్చిన సీఎం జగన్ ని కోరారు.
ఆ సమయంలో తక్షణ ఆర్థిక సహాయం గా రూ. లక్ష అందించాలని ఆదేశించిన జగన్... ప్రతి నెలా రూ.5 వేల వైఎస్సార్ నవశకం ఆరోగ్య పింఛను సైతం అందేలా చూడాలని అధికారులకు చెప్పారు. అదే సమయంలో.. ఆర్థికంగా కుటుంబానికి ఆసరా అందించేందుకు సూర్య కుమారికి నిడదవోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉద్యోగం ఇచ్చారు.