సూపర్ సిక్స్... బాబు ప్రజెంటేషన్ పై విపక్షాల మండిపాటు!
ఈ క్రమంలో... 50 లక్షల మంది అన్నదాతనలను వంచించారు.. 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారు.. 1.50 కోట్ల మంది మహిళలను మోసం చేశారు.. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు అని షర్మిల విమర్శించారు.
ఏపీలో తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రజలు అర్ధం చేసుకోవాలి.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసింది.. హామీల అమలుకు ఆలస్యం అవుతుందన్నట్లుగా చంద్రబాబు స్పందించారు! దీంతో.. విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ సమయంలో వైఎస్ షర్మిళ స్పందించారు.
అవును... ఏపీలో సూపర్ సిక్స్ హామీలు అమలుచేయడం లేదు అంటూ కొన్ని సార్లు మీడియా ముఖంగా, పలుమార్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.. తాజాగా "సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్" అంటు ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా... కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే అని తెలిపారు.
దీనికి నిన్న చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషనే నిద్రర్శనమని.. నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలంటూ నీతి సూక్తులు చెప్పారని.. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలనే మాటలు మోకాలికీ బోడి గుండుకూ ముడిపెట్టినట్లుగా ఉందంటూ షర్మిల ఫైర్ అయారు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని మండిపడ్డారు.
ఈ క్రమంలో... 50 లక్షల మంది అన్నదాతనలను వంచించారు.. 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారు.. 1.50 కోట్ల మంది మహిళలను మోసం చేశారు.. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు అని షర్మిల విమర్శించారు. ఈ సమయంలో ‘హామీలు ఇచ్చేటప్పుడు ఈ విషయాలన్నీ తెలియదా..?’ అని షర్మిల ప్రశ్నించారు.
ఇందులో భాగంగా... పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని.. అందుకు వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని చెబుతున్న బాబుకు.. "సూపర్ సిక్స్" పథకాల రూపకల్పనలో ఈ ఘోరం, రాష్ట్ర ఆర్థిక భారం కనబడలేదా..? రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పింది మీరేకదా..? అని నిలదీశారు!
ఇదే సమయంలో... టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో పాలన గాడిన పెడతామన్న మీరే.. తీరా ఓట్లు పడిన తర్వాత ఇచ్చిన హామీలపై పడతపేచీ పెట్టడం ఎంతవరకూ సమంజసం..? అని షర్మిల ప్రశ్నించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో... సాకులు వెతకడం మాని పథకాల అమలుపై దృష్టి పెట్టాలని.. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే మీరు రాష్ట్రంలోని పరిస్థితిని మోడీకి చెప్పాలని.. పథకాలకు నిధులు అడగాలని.. గత ఐదేళ్లలో ఆర్థిక అరాచకం జరిగితే దర్యాప్తు జరిపించాలని.. పథకాలకు డబ్బులు ఇవ్వకపోతే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోవాలని అని షర్మిల డిమాండ్ చేశారు!
ఇప్పుడు ఏ గుడి మెట్లు కడుగుతావు పవన్..?:
సూపర్ సిక్స్ పథకాలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది. ఇందులో భాగంగా.. చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారని.. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేనని మోసం చేశారని మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇదే సమయంలో.. ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంటో పవన్, చంద్రబాబుకు తెలియదా అని నిలదీశారు.
ఎన్నికల సమయంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా.. వైఎస్ జగన్ కంటే ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడేమో ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా చంద్రబాబు తీరు ఉందని భూమన దుయ్యబట్టారు. ప్రస్తుతం చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని.. ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ ప్రస్థావన తెచ్చిన భూమన... చంద్రబాబు అబద్ధలా మాటలపై డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో.. అబద్ధాలు చెప్పినందుకు ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏ గుడిమెట్లు కడుగుతారో చెప్పాలని ఎద్దేవా చేశారు!