'నిజంగా సిగ్గు పడాల్సిన విషయం'... లెక్కలతో తగులుకున్న షర్మిల!

మహిళలపై జరుగుతున్న దాడులపై ఏపీ అసెంబ్లీలో జరిగిన కీలక చర్చపై లెక్కలు ప్రస్థావిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Update: 2024-11-19 03:39 GMT

ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ను తలుపుచెక్కతో కొడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని తమలపాకుతో కొడుతున్నారు అనే విమర్శలను సొంతం చేసుకున్న షర్మిల.. ఈసారి ఇరుపక్షాలకూ ఫుల్ డోస్ ఇచ్చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ఏపీ అసెంబ్లీలో జరిగిన కీలక చర్చపై లెక్కలు ప్రస్థావిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అవును... మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... గత 10ఏళ్లలో ఏపీ పాలకులు రాజకీయాలపై పెడుతున్న శ్రద్ధ.. మహిళల రక్షణపై పెట్టడం లేదంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మహిళల రక్షణ, దాడుల విషయంపై జరిగిన చర్చపై ఎక్స్ వేదికగా గట్టిగా స్పందించారు.

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘయిత్యాలను అరికట్టడంలో గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని.. తాజాగా శాసనమండలిలో జరిగిన చర్చే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్న షర్మిల... 2014 నుంచి 2024 వరకూ.. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినట్లు చెప్పిన కేసుల లెక్కలను ప్రస్థావించారు.

2014-2019లో 83,202 కేసులు నమోదైతే.. 2019-2024లో 1,00,508 కేసులు నమోదయ్యాయని.. అంటే.. తమ పాలనలో కంటే వైసీపీ హయాంలోనే 20 శాతం ఎక్కువ కేసులు అని టీడీపీ.. లేదు, కుటమి వచ్చాకే రోజుకు సగటున 59 అత్యాచారాలు నమోదు అని వైసీపీ మహిళల మానప్రాణాల మీద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అంటే... ఏది ఏమైనా గడిచిన 10 ఏళ్లలో సుమారు 2 లక్షల కేసులు నమోదు అయ్యాయంటే.. మహిళలకు భద్రత కల్పించడంలో మన రాష్ట్రం ఎక్కడుందో అర్థమవుతుందని.. మహిళలపై క్రైమ్ రేటు అరికట్టలేని వైసీపీ, టీడీపీలు రెండూ దొందూ దొందే అని.. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయం అని, సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అంటూ షర్మిల విరుచుకుపడ్డారు.

ఇదే సమాంలో... నిర్భయ, దిశ లాంటి చట్టాలు పేరుకే తప్ప అమలుకు నోచుకోలేదని అన్నారు. మహిళలపై వికృత చేష్టలకు పాల్పడితే 40 రోజుల్లో కఠిన శిక్షలు అని చంద్రబాబు.. దిశ చట్టం కింద 20 రోజుల్లోనే ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని జగన్ మహిళల చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టారు తప్ప.. చట్టాలను అమలు చేసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు.

చట్టాల పేరు చెప్పి, భద్రతకు పెద్ద పీట అంటూ ఆర్భాటపు ప్రచారాలు తప్ప.. గత 10 ఏళ్లలో ఓ ఒక్క నేరస్థుడికి కఠిన శిక్షలు పడలేదని.. కేసులు ఛేదించాల్సిన పొలీసులను కక్ష సాధింపు రాజకీయాలకు వాడుతున్నారని.. అభివృద్ధిలో చివరి స్థానం.. మాదకద్రవ్యాల వాడకం, మహిళలపై అఘాయిత్యాల్లో ప్రథమ స్థానం ఏపీది అంటూ షర్మిల విమర్శించారు.

Tags:    

Similar News