బీజేపీపై ష‌ర్మిల కామెంట్లు.. నెటిజ‌న్ల కౌంట‌ర్లు.. అదిరిపోయాయిగా!

ఏపీ కాంగ్రెస్ నాయ‌కురాలు, ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల తాజాగా బీజేపీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Update: 2024-03-31 15:04 GMT

ఏపీ కాంగ్రెస్ నాయ‌కురాలు, ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల తాజాగా బీజేపీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు కూడా అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. బీజేపీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని.. మోడీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని ష‌ర్మిల చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

+ మనదేశంలో భారత రాజ్యాంగం నడవడంలేదని, బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని షర్మిల విమర్శించారు. ``కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత భయం? బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది... అందుకే ఈడీ, సీబీఐ వంటి సంస్థలను విపక్షాలపై ఉపయో గించి ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు, కాంగ్రెస్ పార్టీ వద్ద ఒక్క రూపాయి కూడా ఉండకూడ దన్నదే బీజేపీ సర్కారు కుట్ర`` అని ఆరోపించారు. అయితే.. దీనిపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. నిజానికి లెక్క‌లు స‌రిగా ఉంటే ఎవ‌రు మాత్రం త‌ప్పుబ‌డతారు? అని ప్ర‌శ్నిస్తున్నారు. కొంద‌రు బీజేపీ ఇప్ప‌టికే 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉంద‌ని అన్నారు. దీనికి ఓట‌మి భ‌యం ఎందుకు ష‌ర్మిలమ్మా? అని అంటున్నారు.

+ ఇక‌, కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయ‌డంపై నిరసనగా విజయవాడ ఐటీ ఆఫీసు వద్ద ధర్నా తలపెడితే పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటు అని షర్మిల ధ్వజమెత్తారు. దీనిపైనా నెటిజ‌న్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఎక్క‌డో ఢిల్లీలో జ‌రిగిన దానికి ఏపీలో ధ‌ర్నాలు ఎందుకు? అక్క‌డే చేయొచ్చు క‌దా! అని ప్ర‌శ్నిస్తున్నారు.

+ మ‌రోవైపు.. ఏపీకి ఒక్క మేలు చేయకపోయినా అదానీ, అంబానీల అనుచరులకు పదవులు ఎందుకు కట్టబెడుతున్నారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని ష‌ర్మిల‌ నిలదీశారు. దీనిపైనా నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలానే జిందాల్ వంటి ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌కు ఆస్తులు క‌ట్ట‌బెట్ట‌లేదా? ప‌నులు అప్ప‌గించ‌లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

+ చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంది భయంతోనే అని ష‌ర్మిల‌ పేర్కొన్నారు... ఓకే.. ఇది నిజ‌మే అనుకుందాం.. మ‌రి ఇండియా కూట‌మిగా ఏర్ప‌డి.. కాంగ్రెస్ 13 పార్టీల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు ఎలా వెళ్తోంద‌ని.. నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీలో క‌మ్యూనిస్టుల తో క‌లిసి మీరు కూడా పొత్తు పెట్టుకున్నారు క‌దా.. మ‌రి మీరు కూడా భ‌య‌ప‌డుతున్నారా? అని నిల‌దీస్తున్నారు.

Tags:    

Similar News