షర్మిళ కాం అయిపోయారు... కారణం ఇదేనంటున్నారు!

ఈ నేపథ్యంలో గతకొన్ని రోజులుగా షర్మిళ మౌనానికి సరికొత్త భాష్యాలు తెరపైకి వస్తున్నాయి

Update: 2024-03-14 14:47 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లోకి అనూహ్యంగా దూసుకువచ్చారు వైఎస్ షర్మిళ. అందుకు కారణం రేవంత్ రెడ్డి ఆమెను తెలంగాణ రాజకీయాలకు దూరం చేయాలని భావించడమే అని కొందరంటే... ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకురావాలనే అధిష్టాణం ఆలోచనే అందుకు అసలు కారణం అని మరికొందరు గట్టిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గతకొన్ని రోజులుగా షర్మిళ మౌనానికి సరికొత్త భాష్యాలు తెరపైకి వస్తున్నాయి.

అవును... ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోకముందు తెలంగాణ రాజకీయాల్లో హల్ చల్ చేసిన వైఎస్ షర్మిళ... అనూహ్యంగా అక్కడ పోటీ నుంచి విరమించుకున్నారు. దీంతో... వైఎస్సార్టీపీ కథ కంచికి చేరింది! అనంతరం ఆమె ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి వచ్చీ రాగానే వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. ఏపీకి చంద్రబాబు, జగన్ లు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.

ఈ సమయంలో చంద్రబాబుని తమలపాకుతోనూ, వైఎస్ జగన్ ని తలుపుచెక్కతోనూ కొడుతున్నట్లుగా విమర్శలు చేయడంతో.. ఆమె చంద్రబాబు కోసమే రాజకీయం చేస్తున్నట్లుగా, ఆమెను టీడీపీ నేతలతో కలిసి ఒకే గాటికి కట్టి విమర్శలు చేయడం మొదలుపెట్టారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ - బీజేపీ - జనసేన కలిసి పొత్తు పెట్టుకొవడంపై... "అందరూ దొంగలే" అని స్పందించిన ఆమె.. అనంతర కాలంలో కాస్త కాం అయిపోయారనే చర్చ మొదలైంది.

అయితే... వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ - జనసేన – కాంగ్రెస్ కు బద్దశత్రువైన బీజేపీ ఏకం కావడంతో.. జగన్ కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు తెలిపే ఉద్దేశ్యంలోనే షర్మిళ మౌనం వహించారని అంటున్నారు. ఇదే సమయంలో... వైసీపీ మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలవనుందా అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి సంకేతాలూ కనిపించనప్పటికీ... షర్మిళ మౌనం తెరవెనుక జరుగుతున్న రాజకీయానికి సంకేతమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరొపక్క ఇప్పటికే.. వైఎస్ జగనే తన చెల్లెలు షర్మిళను కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని... కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు ఇబ్బందులు తలెత్తకుండా చేసిన వ్యూహంలో భాగమే ఈ నిర్ణయమని హర్ష కుమార్ వంటి నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న సమయంలో వైఎస్ షర్మిళ మౌనం వహించడంపై ఇలాంటి ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి.

Tags:    

Similar News