రూ.1000 కోట్ల వ్యవహారంపై షర్మిళ ఘాటు రియాక్షన్!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయం తీవ్రస్థాయిలో వేడెక్కుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-06 07:51 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయం తీవ్రస్థాయిలో వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... వైఎస్ జగన్ వర్సెస్ షర్మిళ వ్యవహారం పీక్స్ కి చేరుతుంది. ఇందులో భాగంగా... రూ.1000 కోట్ల వ్యవహారం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... షర్మిల అడిగిన రూ.1000 కోట్ల పనులు చేయకపోవడమే ఆమె తమతో విభేదించడానికి కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ వర్సెస్ షర్మిళ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుంది. ఇందులో భాగం... రూ.1000 కోట్ల పనులు అడిగితే చేయలేదనే షర్మిళ తమతో విభేదించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నవేళ... ఆమె రియాక్ట్ అయ్యారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానంటూ వైసీపీ నేతలకు షర్మిళ సవాల్ విసిరారు. దీంతో... ఈ వెయ్యి కోట్ల పనుల వ్యవహారం ఎన్నికల వేళ తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై మరింత స్పందించిన షర్మిళ... వివేకా హత్య కేసుపై మాట్లాడుతూ జగన్‌ అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ కావాలని అడిగారు కానీ.. అధికారంలోకి రాగానే మాత్రం ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో... జగన్‌ ను చూసుకునే తెలంగాణ నేత రాఘవరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ఇక రూ.వెయ్యి కోట్ల ఆరోపణలపై స్పందించిన షర్మిళ... ఆ వ్యవహారానికి సంబంధించి రుజువులు ఉంటే బయటపెట్టాలని కోరారు. ఇటీవల కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైనా షర్మిల స్పందించారు. ఇందులో భాగంగా... తన భర్త అనిల్‌ కుమార్‌ బీజేపీ నేతను ఎక్కడా కలవలేదు, కలవరని చెప్పారు. ఇదే క్రమంలో... అవినాష్‌ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని షర్మిల ఎద్దేవా చేశారు.

అదేవిధంగా... బీజేపీతో కంటికి కనిపించని పొత్తును జగన్‌ కొనసాగిస్తున్నారని చెప్పిన షర్మిళ... అదానీ, అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టారని ఫైరయ్యారు. ఇదే సమయంలో... జగన్‌ బీజేపీకి దత్తపుత్రుడని నిర్మలా సీతారామన్‌ చెప్పారని.. మోడీ వారసుడిగానే ఆయన ఉన్నారు తప్ప వైఎస్సార్‌ వారసుడిగా కాదని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో... తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌ లో పెట్టించిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని షర్మిళ తీవ్ర విమర్శలు చేశారు!

Tags:    

Similar News