షర్మిల ఫైర్ తగ్గటం లేదే .. కారణమేంటి ?!

ఆఖరుకు 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల బరి నుండి తప్పుకుని కేసీఆర్ ఓటమి ధ్యేయంగా తప్పుకున్నట్లు ప్రకటించింది.

Update: 2024-07-12 16:46 GMT

అన్నాచెల్లెల్ల ఆస్తుల పంచాయతీ కారణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కూతురు, మాజీ ఎపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల 2021 జూలై 8న తన తండ్రి వైఎస్ జన్మదినం సందర్భంగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది.

పార్టీ ఏర్పాటు తర్వాత తెలంగాణలో 3400 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల ఈ మధ్యకాలంలో వచ్చిన తెలంగాణలో వచ్చిన ఏ ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆఖరుకు 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల బరి నుండి తప్పుకుని కేసీఆర్ ఓటమి ధ్యేయంగా తప్పుకున్నట్లు ప్రకటించింది.

ఆ తర్వాత ఏపీలో శాసనసభ ఎన్నికలకు ముందు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. షర్మిల ఆశించినట్లు అటు తెలంగాణలో కేసీఆర్, ఇటు జగన్ ప్రభుత్వాలు అధికారం కోల్పోయాయి. అయినా కూడా షర్మిల అన్న జగన్ విషయంలో ఎక్కడా సానుభూతి చూపడం లేదు. కన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని జగన్ ఎందుకు పెద్ద ఎత్తున జరపలేదని తాజాగా ప్రశ్నించింది.

‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని ఎంత గొప్పగా చేసి ఉండాల్సింది? ఏదో మొక్కుబడిగా చేశారు. వైఎస్సార్ 75వ జయంతికి జగన్ ఇడుపులపాయకు వెళ్లారు. వెళ్లి ఏం చేశారు? అక్కడ ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాల్లో ముగించేశారు. కనీసం అక్కడ కూర్చోలేదు.నిలబడే రాజశేఖర్ రెడ్డి గారికి తూతూ మంత్రంలా నివాళులు అర్పించేశారు.సొంత తండ్రి 75వ జయంతిని జరిపే తీరు ఇదేనా? సిద్ధం అంటూ పెద్ద పెద్ద సభలు పెట్టారు. పెద్ద పెద్ద హోర్డింగ్ లు పెట్టుకున్నారు. ఒక్కో సభకు రూ.30 కోట్లు, రూ.40 కోట్లు ఖర్చు పెట్టారు. మరి రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఒక్క సభను కూడా ఎందుకు పెట్టలేదు. వైఎస్ నా తండ్రి, మా కాంగ్రెస్ పార్టీ నేత కాబట్టి పెద్ద సభ పెట్టాం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల మంత్రులు వచ్చారు. సోనియా, రాహుల్ సందేశాలు పంపారు. మీరా వైఎస్ వారసులు ? మేమా ?’’ అంటూ షర్మిల ప్రశ్నించడం విశేషం. మొత్తానికి అన్నను కసితీరా ఓడించినా షర్మిలలో ఫైర్ తగ్గడం లేదు .. మరి కారణం ఏంటని ఇటు వైసీపీ శ్రేణులు, అటు జగన్ అభిమానులు తలపట్టుకుంటుండడం విశేషం.

Tags:    

Similar News