ఏపీ జ‌నాల‌కు ష‌ర్మిల ఇచ్చే హామీలు ఇవే..!

ఈ క్ర‌మంలో ష‌ర్మిల హామీల‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫ్రీహ్యాండ్ ఇచ్చిన నేప‌థ్యంలో ష‌ర్మిల ఇచ్చే హామీలు ఏంట‌నేది కూడా చ‌ర్చ‌గా మారింది.

Update: 2024-01-18 14:30 GMT

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న వైఎస్‌ ష‌ర్మిల‌.. ఖ‌చ్చితంగా కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు రెండు మాసాల ముందే ఏపీలో అడుగు పెట్టనున్నారు. ఈ క్ర‌మంలో ఆమె ఇచ్చే హామీలేంటి? పార్టీని ఎలా ప‌రుగులు పెట్టిస్తారు? అనేది కీల‌కంగా మారింది. ఈ క్ర‌మంలో ష‌ర్మిల హామీల‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫ్రీహ్యాండ్ ఇచ్చిన నేప‌థ్యంలో ష‌ర్మిల ఇచ్చే హామీలు ఏంట‌నేది కూడా చ‌ర్చ‌గా మారింది.

కాంగ్రెస్ ఎప్ప‌టి నుంచో చెబుతున్న కేంద్రంలో పార్టీ అధికారంలోకి వ‌స్తే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామన్న హామీని ఇప్పుడు ష‌ర్మిల క్షేత్ర‌స్థాయిలోకి తీసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేయొచ్చు. క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్న మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సును ఇక్క‌డ కూడా.. చెప్ప‌చ్చు. ముఖ్యంగా ష‌ర్మిల మ‌హిళా నాయ‌కురాలు కాబ‌ట్టి.. మ‌హిళా ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేసేలా.. ఏడాదికి 6 వంటగ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఉచితంగా ఇస్తామ‌ని చెప్పే అవ‌కాశం ఉంది.

అదేవిధంగా మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త‌ను ప్ర‌ధానంగా ఆమె ప్ర‌స్తావించ‌వ‌చ్చు. దేశంలో మ‌హిళ‌ల‌పై అధిక శాతంలో జ‌రుగుతున్న దాడుల్లో ఏపీ కూడా ఒక‌టి. సో.. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించి.. ఆమె వారి ఓట్ల‌కు గేలం వేసే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఇమేజ్‌ను గ్రామీణ స్థాయిలో ప్ర‌చారం చేసుకుని.. వారి ఓట్ల‌పై కూడా క‌న్నేసే ఛాన్స్ క‌నిపిస్తోంది. విద్య‌, వైద్యం విష‌యంలో ఇప్ప‌టికే ఏపీ దూకుడు గా ఉన్న నేప‌థ్యంలో వాటి జోలికి పోకుండా. ఇత‌ర అంశాల‌ను ప్ర‌స్తావించే ఛాన్స్ క‌నిపిస్తోంది.

మ‌రీ ముఖ్యంగా కాంగ్రెస్ పాత‌కాపుల‌కు ఆమె ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా.. తిరిగి వైఎస్ కాంగ్రెస్‌ను తీసుకువ‌స్తున్న‌ట్టు ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. అదేస‌మ యంలో ఇత‌ర పార్టీలు ప్ర‌స్తావిస్తున్న ఇసుక‌, మ‌ద్యం విష‌యాల‌ను ష‌ర్మిల ఎలా తీసుకువెళ్తారు? వీటిపై ఎలాంటి హామీలు ఇస్తార‌నేది చూడాలి. పండుగ కానుక‌లు.. ప్ర‌తి మ‌హిళ‌కు నెల‌కు ఇంత మొత్త‌మ‌ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల‌లో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను కూడా ఆమె ప్ర‌స్తావించే ఛాన్స్ క‌నిపిస్తోంది. మొత్తంగా.. ష‌ర్మిల ప్ర‌చారంలో వైఎస్ జ‌ప‌మే ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News