అవి అప్పులు కావు..జగన్ మీద షర్మిల హాట్ కామెంట్స్ !?
ఆమె కర్నూల్ లో న్యాయ యాత్ర నిర్వహిస్తూ సొంత చెల్లెలుకు ఆస్తులు పంచడం అన్నది అన్న బాధ్యత అన్నారు. ఆడబిడ్డకు ఏ అన్న అయినా న్యాయం చేయాలని ఆమె అన్నారు.
తాను కడప ఎంపీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసినపుడు అందులో తన ఆస్తులు అప్పులు చూపించాను అని అయితే అందులో జగన్ నుంచి అప్పు తీసుకున్నట్లుగా ఉన్నది అప్పులు కావు ఆస్తులు అని షర్మిల అన్నారు. ఆమె కర్నూల్ లో న్యాయ యాత్ర నిర్వహిస్తూ సొంత చెల్లెలుకు ఆస్తులు పంచడం అన్నది అన్న బాధ్యత అన్నారు. ఆడబిడ్డకు ఏ అన్న అయినా న్యాయం చేయాలని ఆమె అన్నారు.
ఆస్తిలో చెల్లెలుకూ సమాన వాటా ఉంటుందని ఆమె గుర్తు చేశారు. వాటిని ఇవ్వాల్సిన బాధ్యత అన్న పైన ఉంటుందని అన్నారు. అయితే కొంతమంది చెల్లెలుకు ఇవ్వాల్సిన ఆస్తిని కూడా తమదిగా భావిస్తారు అని జగన్ మీద ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు.
చెల్లెళ్లకు కొసరుగా ఎంతో కొంత ఇచ్చి అది కూడా అప్పుగా చూపిస్తూంటారు అని ఆమె ఫైర్ అయ్యారు. అయితే ఇక్కడ అర్ధం కాని విషయం ఏమిటి అంటే అమె అఫిడవిట్ లో అప్పుగా జగన్ కి ఇవ్వాల్సింది తానే చూపించారు. అయితే అది ఆమె ఆస్తిగా రావాల్సిందిగా ఉందా లేక వేరేగా అప్పుగా తీసుకుందా అన్నది తెలియడం లేదు అయితే షర్మిల కామెంట్స్ ని బట్టి తనకు తండ్రి ఆస్తిలో వాటాగా రావాల్సిన మొత్తాన్ని అన్న ఇవ్వలేదని అంటున్నారు. అడిగితే అప్పుగా కొంత మొత్తం ఇచ్చారని అంటున్నారు.
మరి తండ్రి ఆస్తులు అన్నీ ఇద్దరు బిడ్డలకు సమానంగా పంచారని వైఎస్సార్ కుటుంబీకులు చెబుతూ ఉంటారు. వైఎస్సార్ చెల్లెలు, జగన్ షర్మిల మేనత్త విమలారెడ్డి అయితే ఆస్తులు అన్నీ ఈడీ సీబీఐ సీజ్ చేసిందని అందువల్లనే పంపకాలు కొన్ని జరగలేదని చెప్పారు. జరిగిన వాటిలో ఇద్దరికీ సమానంగానే వచ్చాయని చెప్పారు.
అయితే జగన్ తో చాలా వివాదాలు చెల్లెలు షర్మిలకు ఉన్నాయని అందులో ఆస్తుల విషయం కూడా ప్రధానం అని ఇంత కాలం అంతా అంటూ వచ్చారు. ఇపుడు షర్మిల కర్నూల్ లో చేసిన కామెంట్స్ చూసిన తరువాత అంతా ఆస్తుల వివాదం పెద్దదిగానే ఉంది అని అనుకుంటున్నారు.
మరో వైపు చూస్తే అన్నగా బాధ్యతగా కాకుండా అప్పులు ఇచ్చారని చెప్పడంతో మరోసారి జగన్ షర్మిల మధ్య వివాదం చర్చకు వస్తోంది. అంతే కాదు, తాను తన కుటుంబం రేపటి రోజుల ఎలా ఉంటారో ఏమవుతుందో తెలియదు అని షర్మిల అన్నారు. అంతే కాదు తనకు ఎలాంటి ఆస్తులు పంచారు అన్నది కుటుంబానికి పైన ఉన్న దేవుడికి తెలుసు అన్నారు. దాంతో అన్నా చెల్లెళ్ళ మధ్య వివాదం మళ్లీ రచ్చ అయ్యేలా ఉంది. ఆస్తుల వ్యవహారంతో పాటు ఇతర అంశాలు అన్నీ కలిసే ఇద్దరి మధ్య గ్యాప్ పెంచేసి ఈ రోజున వేరు వేరు పార్టీలలో ఉండేలా చేశాయని అంటున్నారు.