మాజీలకు పిలుపు : కొణతాల ఇంటికి షర్మిల...!

ఆయనతో ఆమె భేటీ అయి ముచ్చటించిన వార్త ఇపుడు వైరల్ అవుతోంది.

Update: 2024-01-23 17:12 GMT

ఉమ్మడి విశాఖ జిల్లా కీలక నేత మాజీ మంత్రి అయిన కొణతాల రామకృష్ణ ఇంటికి కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల వెళ్ళారు. ఆయనతో ఆమె భేటీ అయి ముచ్చటించిన వార్త ఇపుడు వైరల్ అవుతోంది. కొణతాల రామకృష్ణ

షర్మిల కొణతాలన్ రామకృష్ణను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఆమె ఇంతకు ముందే అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఫోన్ చేసి కొణతాలతో మాట్లాడినట్లుగా ప్రచారం లో ఉంది. అయితే అప్పట్లో కొణతాల తాను తిరిగి కాంగ్రెస్ లో చేరడానికి నో చెప్పినట్లుగా కూడా చెప్పుకున్నారు.

మరో వైపు చూస్తే కొణతాల ఇటీవల హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఆ మీదట ఆయన విశాఖలో ఆదివారం తన అభిమానులు అనుచరులతో కీలకమైన సమావేశం నిర్వహించారు. వారందరి అభిప్రాయం తీసుకున్న మీదట జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు.

అయితే కొణతాల జనసేనలో చేరుతున్నట్లుగా నిర్ణయం వెల్లడించినా ఆయన ఇంటికి వైఎస్ షర్మిల వెల్లడం మీద చర్చ సాగుతోంది. ఆమె ఆయనను కలసి కాంగ్రెస్ లో చేరేలా ఒప్పించగలను అన్న నమ్మకంతో ఇలా చేసారు అని అంటున్నారు. ఎందుకంటే కొణతాల ఇంకా జనసేనలో చేరలేదు కాబట్టి అని అంటున్నారు.

అయితే కొణతాల అభిమానులు మాత్రం ఆయనను జనసేనలోనే కొనసాగమని కోరుతున్నారని అంటున్నారు. జనసేన టీడీపీ కూటమి వల్ల వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు. దాంతో కొణతాల ఇపుడు షర్మిలకు కాంగ్రెస్ లో చేరే విషయంలో ఏమి చెప్పి ఉంటారు అన్నది చర్చగా ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే కొణతాల వైఎస్సార్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఆయన వైఎస్సార్ వెంట ఆయన ఉన్నంతకాలం ఉన్నారు. ఆ తరువాత జగన్ వెంట నడిచారు. 2014లో వైఎస్ విజయమ్మ విశాఖలో ఎంపీగా పోటీ చేయడం వెనక కూడా కొణతాల ఆలోచనలు ఉన్నాయని అంతున్నారు. ఏది ఏమైనా జగన్ తో విభేదాల వల్ల బయటకు వచ్చిన కొణతాల గత పదేళ్లలో రాజకీయంగా కుదురుకోలేకపోయారు.

ఆయన ఇపుడే మళ్లీ రాజకీయంగా యాక్టివ్ గా ఉండాలని చూస్తున్నారు. దాంతో ఆయన జనసేనను ఎంచుకున్నారు. అసలే నిర్ణయాలు రాజకీయంగా తీసుకోవడంలో కొణతాల ఊగిసలాడుతారు అని పేరు ఉంది. ఇపుడు కనుక ఆయన తిరిగి కాంగ్రెస్ అని మనసు మార్చుకుంటే మాత్రం కచ్చితంగా ఆయన క్రెడిబిలిటీయే పోతుంది అని అంటున్నారు. అంతే కాదు క్యాడర్ కూడా అంగీకరించే పరిస్థితి ఉండదు అని అంటున్నారు. చూడాలి మరి కొణతాల ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో.

Tags:    

Similar News