అమ్మాయిలను టచ్ చేస్తూ దొరికారు... వీడియో వైరల్!

ఈ వీడియోలో బహిరంగ ప్రదేశాల్లో మహిళలను అసభ్యంగా తాకుతున్న ఆకతాయిల చేష్టలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Update: 2023-09-23 07:07 GMT

వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ నగరంలో మహిళలకు రక్షణ కల్పించడానికి హైదరాబాద్ షీ టీం లు అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మహిళల రక్షణ, భద్రత విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ఈ పోలీసు వ్యవస్థ అత్యంత పగడ్భందీగా, అత్యంత వ్యూహాత్మకంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో తాజాగా వారు చేసిన ఒక పని వైరల్ గా మారింది.


అవును... తాజాగా "మీ కదలికలు నిశితంగా గమనించబడుతున్నాయనే విషయం గ్రహించి ప్రవర్తించండి.." అంటూ హైదరాబాద్ సిటీ పోలీస్ తాజాగా ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో బహిరంగ ప్రదేశాల్లో మహిళలను అసభ్యంగా తాకుతున్న ఆకతాయిల చేష్టలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

వివరాళ్లోకి వెళ్తే... బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుంపులుగా ఉన్న చోట్లా, రద్దీగా ఉన్న బస్సుల్లోనూ, క్యూ లైనొలలోనూ కొందరు ఆకతాయిలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. వారిని ఎక్కడబడితే అక్కడ తాకుతుండటం, చేతులేయడం చేస్తుంటారు. ఈ సమయంలో పిల్లి కళ్లుమూసిని పాలుతాగుతూ.. తనను ఎవరూ పరిశీలించడం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు.

తాము చేసే ఆకతాయి పనులను ఎవరు చూడడం లేదనుకుని క్షణికానందంతో కూడిన శునకానందం పొందుతుంటారు! అయితే ఇలాంటి ఆకతాయిల ఆట కట్టించేందుకు షీ టీం నిత్యం ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. వెతికి వెతికి మరీ పట్టుకుని అరెస్ట్ చేస్తుంది. తాజాగా అలాంటి పనే చేసింది.

జనం ఎక్కువగా గుమిగూడిన చోట కొంతమంది ఆకతాయిలు... మహిళలను అసభ్యకరంగా తాకుతూ, భుజాలపై చేతులు వేస్తూ, పొరపాటున వేసినట్లు కవరింగ్ ఇస్తూ ప్రవర్తిస్తున్నారు. అయితే తాజాగా వారిని షీ టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వారు చేస్తున్న పనులకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. హెచ్చరికలు జారీ చేసింది!

Tags:    

Similar News