జాత‌ర‌లో డాన్సు వేసే ఉద్యోగం ఇప్పిస్తా!

తాజాగా స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్-అత‌డి బావ‌మరిది మ‌ధ్య కూడా రాజ‌కీయం పెద్ద చిచ్చే పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

Update: 2024-06-09 08:43 GMT

దేశంలో రాజ‌కీయాలు ఏ స్థాయికి చేరాయో తెలిసిందే. రాజ‌కీయం కార‌ణంగా సొంత కుటుంబాలే విచ్చిన్న‌మై పోతున్నాయి. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య వైరాలు..అక్కా చెల్లి మ‌ధ్య గొడ‌వ‌లు..బావ బామ్మ‌ర్ది మ‌ధ్య కొట్లాట‌లు ఒక‌టేంటే? రాజ‌కీయం అనే రంగు పులుముకుంటే! అది జీవితాంతం ద‌హించి వేస్తుంద‌ని ఎన్నో సంద‌ర్భాల్లో రుజువైంది. అందులోనూ ఈ ర‌క‌మైన రాజ‌కీయాల్లో ఏపీ టాప్ లో ఉంటుంది. దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అందుకే ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా దేశ‌మంతా ఏపీ వైపు చూస్తుంది. ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు లో ఉన్నంత దారుణ‌మైన రాజ‌కీయం ఇంకెక్కాడా ఉండ‌దు. అయితే ఇప్పిడిప్పుడే క‌ర్ణాట‌క‌ కూడా తెలుగు రాష్ట్రాల్ని త‌ల పిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్-అత‌డి బావ‌మరిది మ‌ధ్య కూడా రాజ‌కీయం పెద్ద చిచ్చే పెట్టిన‌ట్లు తెలుస్తోంది. చివ‌రికి స్వ‌యానా బావ‌నే నేనే నీకు జాత‌రలో డాన్స్ వేసే ఉద్యోగం ఇప్పిస్తా..ద‌ర‌ఖాస్తు చేసుకో? అనే స్థాయికి చేరుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే క‌ర్ణాట‌క లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా శివ‌మొగ్గ నుంచి శివ‌రాజ్ కుమార్ భార్య గీత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆబాధ‌లో ఉండ‌గానే బావ‌మ‌రిది బీజేపీ నేత కుమార బంగార‌ప్ప శివరాజ్ ని హేళ‌న చేసాడు. `శివ‌రాజ్ కుమార్ నిరుద్యోగిగా ఉండాల్సిన ప‌నిలేదు. మా గ్రామ జాత‌ర‌లో నృత్యం చేసే ప‌నికి ద‌ర‌ఖాస్తు చేసుకో. నేను ఉద్యోగం ఇప్పిస్తా. నా చెల్లెలు గీత కూడా సినిమా డాన్స‌ర్ కాబ‌ట్టి ఊరికే ఉండాల్సిన ప‌నిలేదు.

ఆమె కూడా ఏదో ప‌ని చేయోచ్చు` అంటూ వేగ్యంగా మాట్లాడారు. దీంతో శివ‌రాజ్ కుమార్ అభిమానులు కుమ‌ర బంగార‌ప్ప ఇంటిని చుట్టుముట్టారు. భారీగా జ‌నం వెళ్ల‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంది. ఇలాంటి వారిని చ‌ట్ట స‌భ‌ల‌కు పంపిస్తారా? అంటూ అభిమానులు మండిప‌డ్డారు. ఇక ఏపీ కుటుంబ రాజ‌కీయాల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. పూర్తిగా క‌క్ష‌పూరిత రాజ‌కీయాలే క‌నిపిస్తాయి.

Tags:    

Similar News