భుజాలపై కూతురు... తలపై కాల్పులు...వీడియో వైరల్!
అగ్రరాజ్యం అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతుందని చెబుతోన్న సంగతి తెలిసిందే.
అగ్రరాజ్యం అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతుందని చెబుతోన్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే నిత్యం ఏదో మూల తుపాకీ శబ్ధం వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ విషయంలో ఇండియా కూడా తక్కువేమీ కాదనే ఆందోళనలు నెలకొంటున్నాయి. యూపీలో జరిగిన సంఘటన ఇందుకు తాజా ఉదాహరణ.
అవును... ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన చిన్న కుమార్తెను భుజాలపై మోస్తున్న వ్యక్తి తలపై.. మోటారు సైకిల్ పై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్చి పరారయ్యారు. అది గమనించిన స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
తుపాకీతో కాల్చిన ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. బాధితుడిని 28 ఏళ్ల షోయబ్ గా గుర్తించారు. ఆ సమయంలో షోయబ్ తన కూతురిని భుజంపై వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. కాల్పులకు ముందు బైక్ పై ఇద్దరు వ్యక్తులు అతన్ని క్రాస్ చేసి ముందుకెళ్లి ఆగడం జరిగింది
అనంతరం దుండగుడు షోయబ్ ను సమీపించి అతని తలపై కాల్చడం వీడియోలో కనిపించింది. ఆ తర్వాత దుండగుడు బైక్ పై వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి అక్కడ్నుంచి పారిపోయారు. తుపాకీతో కాల్చడంతో షోయబ్ ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. అతనితోపాటు అతడి చిన్న కుమార్తె కూడా కిందపడిపోయింది.
ఆగస్టు 13న రాత్రి 7:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని షాజహాన్ పూర్ ఎస్పీ చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని.. నిందితుల గుర్తింపు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఈ దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నోట్: ఈ క్రింది వీడియోలో కొంతమంది ప్రేక్షకులకు హాని లేదా బాధ కలిగించే అంశాలు ఉన్నాయి!