ప్రభాస్ పెద్దమ్మ బీజేపీ ఎంపీ క్యాండిడేట్...!?

ఆ సీటు నుంచి ప్రభాస్ పెద్దమ్మ, క్రిష్ణం రాజు సతీమణి అయిన శ్యామలాదేవిని ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు.

Update: 2024-03-11 03:50 GMT

రెబెల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ రాజకీయ అరంగేట్రం బీజేపీ నుంచి జరగబోతోందా అంటే జవాబు అవును అని వస్తోంది. 2022లో క్రిష్ణం రాజు మరణించారు. ఆయన చనిపోయేనాటికి బీజేపీలోనే ఉన్నారు. ఆయన రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన బీజేపీ తరఫున కేంద్ర మంత్రిగా వాజ్ పేయ్ క్యాబినెట్ లో చేరి పలు శాఖలను నిర్వహించారు.

ఆ తరువాత ప్రజారాజ్యంలో చేరినా క్రిష్ణంరాజు తిరిగి బీజేపీలోకే వచ్చారు. ఆయన రాజకీయ జీవితంలో పదవులు కానీ కీలక పరిణామాలు కానీ బీజేపీతోనే జరిగాయి. ఇక ఆయన కుటుంబంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా టచ్ లో ఉంది అని చెబుతారు.

ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దాంతో ఆయన క్రేజ్ ని కూడా బీజేపీ గమనిస్తోంది. ఈ నేపధ్యంలో టీడీపీ ఎంచుకున్న నర్సాపురం సీటుని కోరి మరీ బీజేపీ తీసుకుంటోందని అంటున్నారు. ఆ సీటు నుంచి ప్రభాస్ పెద్దమ్మ, క్రిష్ణం రాజు సతీమణి అయిన శ్యామలాదేవిని ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు.

ఈ మధ్యకాలంలోనే నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని మొగల్తూరులో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని శ్యామలదేవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడినపుడు రాజకీయాల నుంచి తోసిపుచ్చలేదు అని అంటారు. అయితే ఆమె వైసీపీలోకి చేరుతారు అని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ ఆమె బీజేపీ ద్వారానే ఎంపీగా పోటీ చేస్తారు అన్నది లేటెస్ట్ టాక్.

ఆమె పోటీ చేస్తే ఆటోమెటిక్ గా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది అని అంటున్నారు. దాంతో పాటు కూటమికి కూడా అది బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. మొత్తానికి టీడీపీ నుంచి నర్సాపురం ఎంపీ సీటుని తీసుకుని బీజేపీ పక్కాగా గెలిచే సీటుగా దాన్ని చేసుకోబోతోంది అని అంటున్నారు.

ఈ సీటుని 2014లో బీజేపీ గెలుచుకుంది అని అంటున్నారు. అదే విధంగా బీజేపీకి ఈ సీటు సెంటిమెంట్ అని చెబుతున్నారు. దీంతో ఇక్కడ నుంచి రెండవసారి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజుకు షాక్ తగిలినట్లు అయింది అని అంటున్నారు.

టీడీపీ చేతిలో ఈ సీటు ఉంటే రఘురామకే చాన్స్ అని అంటున్నారు. కానీ అది బీజేపీ తీసుకుందని ఆ పార్టీ క్రిష్ణంరాజు సతీమణిని పోటీ చేయించాలని చూస్తోందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే నర్సాపురం ఎంపీ సీటు ఈసారి రాజకీయంగా సంచలనం రేపేలా ఉంది అని అంటున్నారు. కృష్ణంరాజు సతీమణి పోటీ అంటే కూటమి పెద్దలు కూడా ఓకే అంటారు. ఆ పరిధిలోని అసెంబ్లీ సీట్లను గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది అని వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అని అంటున్నారు.

Tags:    

Similar News