షాకింగ్ నోట్.. నరకం కావాలలంటే నా భర్తను పెళ్లి చేసుకోండి!
ఈ సందర్భంగా... కట్టుకున్న భర్త వేధింపులు తాళలేక ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది.;

ఇటీవల కాలంలో దాంపత్యంలో సమస్యల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న దంపతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదో ఒక మూల ఈ తరహా ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఈ సందర్భంగా... కట్టుకున్న భర్త వేధింపులు తాళలేక ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సందర్భంగా రాసిన లేఖ వైరల్ గా మారింది.
అవును... తాజాగా ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సందర్భంగా తన ఆత్మహత్యకు గల కారణాలను ఓ నోట్ గా రాసింది. ఇందులో భాగంగా... తన భర్త కారణంగా తాను ఎంత మానసిక క్షోభ అనుభవించిందో పేర్కొంది. ఈ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఇప్పుడు సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. ఓ నవ వధువు ఈ నోట్ రాసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భోపాల్ లోని కమలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగ్గా... నవ వధువు నోట్ రాసి నదిలో దూకి బలవన్మరణం చెందింది.
ఈ సమయంలో... ఈ ఘటనకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను బయటకు తీసి, హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సమయంలో ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. భర్త పెట్టిన హింస వల్లే ఈ పనికి పూనుకున్నట్లు గ్రహించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా... తాను ఒక్కటే చెప్పదలచుకున్నా.. మీ మీ ఆడ్దపిల్లల వివాహం విషయంలో జాగ్రత్త వహించండి.. ఆమె జీవితాన్ని నరకంలోకి నెట్టాలంటేనే ఆమెకు వివాహం చేయండి.. నరకం కావాలంటే నా భర్త అభిషేక్ ను పెళ్లి చేసుకోండి అని ఆమె తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు!
ఇదే సమయంలో... అభిషేక్ నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేదు.. నీ వల్ల నేను ఏడుస్తుంటే చూసి రాక్షసానందం పొందావు.. ఇది నీకు చెప్పాలని చాలా సార్లు ప్రయత్నించినా.. నువ్వు వినలేదు.. నువ్వు మారలేదు. నీకు ఒక్కరు కాదు నలుగురైదుగురు గర్ల్ ఫ్రెండ్స్ అవసరం.. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నది అని ఆమె రాసుకొచ్చారు.
ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.