చిరిగిన చంద్రబాబు ఫ్లెక్సీ సాక్షిగా.. 'సిద్ధం' ఫ్లెక్సీకి భద్రత

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి గుంటూరులో చోటు చేసుకుంది.

Update: 2024-02-29 05:33 GMT

ఏపీలో చోటు చేసుకుంటున్న సిత్రాలకు అంతుపొంతు అన్నది లేకుండా పోతోంది. ఓవైపు తమకు భద్రత కల్పించాల్సిన పోలీసులు.. సరైన సమయంలో సరిగా స్పందించటం లేదన్నఆరోపణలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. పోలీసులు కొందరు చేస్తున్న చేష్టల కారణంగా జగన్ సర్కారుకు ఇబ్బందికరంగా మారుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి గుంటూరులో చోటు చేసుకుంది.

గుంటూరు పట్టణంలోని కొరిటిపాడు గుజ్జనగూళ్ల ప్రధాన రహదారిలో పది రోజుల క్రితం.. అధికార వైసీపీ.. విపక్ష టీడీపీిక చెందిన వారు రెండు పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వారు ఫ్లెక్సీని చించేశారు. దీంతో.. టీడీపీ వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలాఉంటే.. బుధవారం ఉదయం నుంచి పోలీసులు విచిత్రమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

చినిగిపోయిన టీడీపీ ఫ్లెక్సీ విషయంలో స్పందించేందుకు పెద్దగా సముఖత వ్యక్తం చేయని పోలీసులు.. అందుకు భిన్నంగా వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద ఒక పోలీసు కానిస్టేబుల్ ను సెక్యూరిటీగా పెట్టేశారు. బుధవారం ఉదయం నుంచి సదరు ఫ్లెక్సీ వద్ద ఒక పోలీసు కానిస్టేబుల్ ను సెక్యూరిటీగా పెట్టేసిన వైనాన్ని తప్పు పడుతున్నారు. ఫ్లెక్సీ సెక్యూరిటీ కోసం ఒక పోలీసు కానిస్టేబుల్ ను రోజంతా డ్యూటీ వేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

దీనికి మించి.. పోటాపోటీగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను ధ్వంసం చేసే అవకాశాన్ని ఇవ్వకుండా.. సీసీ కెమేరాల్ని చుట్టుపక్కల ఏర్పాటు చేయటం ద్వారా.. అటు అధికార పక్ష ఫ్లెక్సీలే కాదు.. విపక్ష ఫ్లెక్సీలకు భద్రత విషయంలో పక్షపాతం వహిస్తున్నారన్న విమర్శలకు లోను కాకుండా ఉంటుంది. అదే సమయంలో మ్యాన్ పవర్ ను సమర్థంగా వాడుకున్నట్లు ఉంటుంది. అనవసర ఉద్రిక్తతలకు చెక్ పెట్టినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఏపీ పోలీసులు ఈ అంశంపై ఎలా రియాక్టు అవుతారో చూడాలి.


Full View


Tags:    

Similar News