బిగ్ బ్రేకింగ్... చంద్రబాబు కోసం రంగంలోకి సీనియర్ లాయర్..!

ఇందులో భాగంగా ఇటీవల అమరావతి కేసుల్లో బాబు తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా రంగంలోకి దిగారని తెలుస్తుంది.

Update: 2023-09-09 11:30 GMT

స్కిల్ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ స్కాం లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నంద్యాయలో చంద్రబాబు అనుమతితోనే అరెస్ట్ చేసిన అధికారులు... రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు.

అవును... చంద్రబాబుని ఏపీ సీఐడీ అధికారులు రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. కాసేపట్లో విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరచనున్నారు. దీంతో చంద్రబాబుకు బెయిల్ దొరుకుతుందా.. లేక జైలు తప్పదా అనే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ సమయంలో ఆశ్చర్యకరమైన పరిణామంలో టీడీపీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇటీవల అమరావతి కేసుల్లో బాబు తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా రంగంలోకి దిగారని తెలుస్తుంది. చంద్రబాబు తరపున వాదించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారని సమాచారం.

దీంతో... ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడ వచ్చిన సిద్ధార్థ్ లూత్రా ఇప్పుడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరుపున తన వాదనలు వినిపించనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సొలిసిటర్ జనరల్‌ గా కూడా పనిచేసిన ఈయన... అమరావతి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో టీడీపీ తరుపున వాదించారు!

ఇదే సమయంలో ఏపీ సీఐడీ తరుపున అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఇలా అత్యంత అనుభవజ్ఞులైన ఇద్దరు సీనియర్ న్యాయవాదులు కాసేపట్లో ఏసీబీ కోర్టులో తమ తమ వాదనలు వినిపించబోతున్నారు. దీంతో... కాసేపట్లో చంద్రబాబుకు బెయిలా... జెయిలా... ప్రశ్నలకు సమాధానం దొరకొచ్చని తెలుస్తుంది.

Tags:    

Similar News