ఆసుపత్రికి ఇచ్చిన బాడీని ఏం చేస్తారు? ఏచూరికి జరిగేది ఇదే!

మరణం తర్వాత మనిషి బాడీని ఆసుపత్రులకు ఇచ్చేయటం లాంటి ఆదర్శాల్ని కొందరు ఫాలో అవుతుంటారు.

Update: 2024-09-15 08:30 GMT

మరణం తర్వాత మనిషి బాడీని ఆసుపత్రులకు ఇచ్చేయటం లాంటి ఆదర్శాల్ని కొందరు ఫాలో అవుతుంటారు. ఇంతకూ అలా ఆసుపత్రిలోని అనాటమీ విభాగానికి డెడ్ బాడీని ఇచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది. కమ్యునిస్ట్ అగ్రనేత సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్ కు అప్పజెప్పనున్న సంగతి తెలిసిందే. మరణానంతరం ఆయన దేహాన్ని ఆసుపత్రికి ఇచ్చేయాలన్న నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి ఇచ్చిన తర్వాత అక్కడేం జరుగుతుంది? అన్న విషయంలోకి వెళితే.. ఎన్నో కొత్త విషయాలు వెలుగు చూస్తాయి.

అంత్యక్రియల నిమిత్తం సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఉంచారు. అంత్యక్రియల అనంతరం ఎయిమ్స్ లోని అనాటమీ శాఖకు సీతారాం ఏచూరి శరీరాన్ని ఇచ్చేస్తారు. సాధారణంగా అనాటమీ డిపార్టుమెంట్ కు ఒక వ్యక్తి బాడీని ఇచ్చిన తర్వాత.. దాన్ని అక్కడకు తీసుకెళతారు. అక్కడ వైద్యవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మానవ అవయువాల గురించి పరిచయం చేస్తారు. ఈ పని చేయటానికి ముందు.. డెడ్ బాడీని ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత దుర్వాసన రాకుండా.. చెడిపోకుండా పలు రకాల రసాయనాల్ని పూస్తారు.

అంతేకాదు.. బాడీ చెడిపోకుండా ఉండేందుకు మైనస్ 20 డిగ్రీల్లో దేహాన్ని భద్రపరుస్తారు. డెడ్ బాడీలోని అవయువాల్ని చూపిస్తూ.. ఆధ్యాపకులు.. శస్త్రచికిత్సల నైపుణ్యాల్ని మెడికల్ విద్యార్థులకు బోధిస్తారు. ప్రాక్టికల్ గా తెలుసుకోవటానికి వీలుగా వైద్య విద్యార్థులే అవయువాల్ని కోయటం.. సర్జరీలాంటివి చేస్తారు. ఇలా మెడికల్ విద్యార్థులు శరీర భాగాలన్నింటితోనూ పలు ప్రయోగాలు చేస్తారు.

ఇది వైద్య విద్యార్థుల పరిశోధనలో ఒక భాగం. ప్రయోగ సమయంలో శరీరాన్ని పూర్తిగా ఉపయోగించటం అయ్యాక.. శరీరం నుంచి ఎముకల్ని తొలగిస్తారు. ముద్దలా మిగిలిన శరీరాన్ని దహనం చేస్తారు. డెడ్ బాడీ నుంచి బయటకు తీసిన ఎముకలను కూడా విద్యార్థులు పరిశోధనలకు ఉపయోగిస్తారు. ప్రయోగాల్లో భాగంగా శరీరాన్ని చాలాసార్లు కత్తులతో కోయాల్సి ఉంటుంది.

అయితే.. చాలామంది ఈ కోతలను ఇష్టపడరు. దాన్ని హింసలా భావిస్తారు. అందుకే.. ఇచ్చేందుకు ఇష్టపడరు. కానీ.. అందుకు భిన్నంగా మరికొందరు ఆలోచిస్తారు. చనిపోయిన తర్వాత తన శరీరం మానవ పరిశోధనలకు ఉపయోగపడటం ద్వారా.. సమాజానికి తనను తాను అర్పించుకోవటంగా భావిస్తారు. అందుకే.. తమ శరీరాన్ని మరణం తర్వాత వైద్య పరిశోధనలకు అప్పగించాలన్న కోరికను కోరతారు. అందుకు తగ్గట్లే.. వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి అందజేస్తుంటారు.

Tags:    

Similar News