తెలుగు రాష్ట్రాల్లో తెగ 'తాగేస్తున్నారంట'.. లెక్కలు ఇవిగో!

ఆ అధ్యయనంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక విషయం తెరపైకి వచ్చింది.

Update: 2024-08-26 11:30 GMT

దేశవ్యాప్తంగా మద్యం వినియోగంలో రాష్ట్రాల వారిగా లెక్కలను తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సర్వే విభాగం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (నిపెప్) తాజాగా వెల్లడించింది. ఆ అధ్యయనంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక విషయం తెరపైకి వచ్చింది. ఇక్కడ తెగ 'తాగేస్తున్నారంట'!

అవును... నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (నివెప్) తాజాగా ఓ అధ్యయనం విడుదల చేసింది. ఇందులో భాగంగా... 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మద్యం వినియోగంపై కీలక విషయాలు తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం.. మద్యంపై తెలంగాణ వార్షిక సగటు తలసరి వినియోగ వ్యయం రూ.1,623 గా పేర్కొంది.

నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్.ఎస్.ఎస్.వో), కన్జ్యూమర్ పిరమిడ్స్ హౌస్ హోల్డ్ సర్వే (ఎన్.పీ.హెచ్.ఎస్) లను ప్రామాణికంగా తీసుకుని చేపట్టి వెళ్లడించిన ఈ నివేదికలో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మద్యంపై వార్షిక సగటు తలసరి వినియోగ వ్యయం రూ.1,306గా ఉందని తెలిపింది.

ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలూ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న వేళ... రూ.1,227 తో ఛత్తీస్ గఢ్, రూ.1,245 తో పంజాబ్, రూ.1,156తో ఒడిశా లు తర్వాత స్థానాల్లో ఉన్నాయని తాజాగా వెల్లడించింది. ఇక కేరళలో రూ.486, హిమాచల్ ప్రదేశ్ లో రూ.457, తమిళనాడులో రూ.330, రాజస్థాన్ లో రూ.308 వ్యయం చేస్తున్నాయని తెలిపింది.

నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్.ఎస్.ఎస్.వో), కన్జ్యూమర్ పిరమిడ్స్ హౌస్ హోల్డ్ సర్వే (ఎన్.పీ.హెచ్.ఎస్) సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం అత్యల్పంగా తలసరి వినియోగ వ్యయం ఉత్తరప్రదేశ్ లో రూ.75, రూ.49గా ఉండటం గమనార్హం. మరోపక్క... ఆయా రాష్ట్రాలకు మద్యంపై వస్తున్న ఆదాయమే మూడో అతిపెద్ద ఆదాయ వనరుగా ఉందని తెలిపింది.

ఇందులో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలో మద్యంపై ఆదాయం అత్యల్పంగా 67 శాతం ఉండగా.. గోవా అత్యధికంగా 722 శాతం ఆదాయం పొందుతున్నట్లు వివరించింది.

Tags:    

Similar News