ఈ పెద్దాయన అసలు విషయం తెలిస్తే.. రెస్పెక్టు టన్నుల కొద్దీ పెరుగుద్ది

మనిషి రూపాన్ని.. వారి వస్త్రధారణ చూసి అంచనా వేసే ఇప్పటి రోజుల్లో.. ఈ పెద్దాయన గురించిన విషయాలు తెలిస్తే నోటి వెంట మాట రాదంతే

Update: 2023-09-28 04:57 GMT

మనిషి రూపాన్ని.. వారి వస్త్రధారణ చూసి అంచనా వేసే ఇప్పటి రోజుల్లో.. ఈ పెద్దాయన గురించిన విషయాలు తెలిస్తే నోటి వెంట మాట రాదంతే. ఒక మారుమూల గ్రామంలో సాదాసీదా జీవితాన్ని గడుపుతూ.. ఎర్ర నిక్కర్ వేసుకొని.. ఇంటి మీద మరేమీ లేకుండా.. జంజ్యం.. తులసి మాట వేసుకున్న పెద్దాయన వద్ద ఉన్న షేర్ల మార్కెట్ విలువ గురించిన సమాచారం తెలిస్తే.. విస్మయం అమాంతంగా వచ్చి పడిపోవటమే కాదు.. టన్నుల కొద్దీ రెస్పెక్టు ఆయన మీద పెరిగిపోతుంది. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉన్నట్లుగా వ్యవహరించే ఈ తరహా వ్యక్తులు ఇవాల్టి రోజుల్లో చాలా తక్కువగా కనిపిస్తుంటారు.

ఆయన గురించి తెలిసిన వారంతా స్టాక్ మార్కెట్ కింగ్ అంటూ ఆయన్ను అభినందిస్తున్నారు. ఇంత స్థాయిలో ఉండి కూడా ఇంతటి సింఫుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న వైనం చూసినోళ్లు ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్న కుతూహలాన్ని ప్రదర్శిస్తున్నారు. రెండు.. మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఈ పెద్ద మనిషి ఎవరు? ఎక్కడుంటారు? ఆయన వద్ద ఉన్న స్టాక్ లెక్కేంటి? వాటి మార్కెట్ విలువ ఎంత? లాంటి వివరాల్లోకి వెళితే..

ఇప్పుడు ఎక్స్.. అందరికి సుపరిచితమైన పాత ట్విటర్ లో రాజీవ్ మెహతా అనే పేజీలో ఒక పోస్టు లో జత చేసిన వీడియోలో.. ఒక పెద్దాయన.. సంప్రదాయ దుస్తుల్లో (ఒంటి మీద ఎర్ర నిక్కరు వేసుకొని... మరేమీ లేకుండా) ఉన్నారు. ఆయన పేరు.. వివరాలు బయటకు రాలేదు కానీ ఆయనది కేరళ ప్రాంతంగా చెబుతున్నారు. ఈ పెద్దాయన ప్రత్యేకత ఏమంటే.. ఆయన వద్ద ఉన్న షేర్ల మార్కెట్ విలువ ఎంతో తెలుసా? అక్షరాల రూ.100 కోట్లకు పైనే.

అంత ఉన్నప్పటికీ.. ఆయన మాత్రం సింఫుల్ గా ఉండటం విశేషం. ఆయన వద్ద 80 కోట్లు విలువ చేసే ఎల్ అండ్ టీ షేర్లు.. రూ.21 కోట్లు విలువ చేసే అల్ట్రాటెక్ సిమెంట్.. రూ.కోటి విలువ చేసే కర్ణాటక బ్యాంక్ షేర్లు కలిగి ఉన్నాయి. అయినప్పటికీ.. సాదాసీదా జీవితాన్ని ఆయన గడుపుతున్నారు. ప్రతి ఏడాది ఆయన సుమారు రూ.6 లక్షల మొత్తాన్ని డివిడెండ్ల రూపంలో పొందుతున్నట్లుగా చెబుతున్నారు. సంపదకు కొందరు ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్న దానికి ఈ పెద్ద మనిషి ఒక ప్రతిరూపంలా కనిపిస్తారు. అందుకే చెబుతారు.. మనిషి రూపాన్ని.. ఆయన వస్త్రధారణను ఆధారంగా అంచనా వేయటానికి మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదని. ఎందుకంటే.. అలాంటి మైండ్ సెట్ ఉంటే.. ఈ పెద్ద మనిషి లాంటి మాణిక్యాల్ని మిస్ కావటం ఖాయం. కాదంటారా?

Tags:    

Similar News