శనివారం రాత్రి 8:10 – 12:20 ఏమి జరిగింది... పోలీసులు ఏమంటున్నారు?

ప్రస్తుతం ప్రధానంగా ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన దాడికి సంబంధించిన విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-04-14 09:36 GMT

ప్రస్తుతం ప్రధానంగా ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన దాడికి సంబంధించిన విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అసలు శనివారం రాత్రి 8:10 గంటల సమయంలో విజయవాడలోని సింగ్‌ నగర్‌ డాబా కొట్ల సెంటర్‌ వద్ద అసలు ఏమి జరిగిందనేది ఆసక్తిగా మారింది. ఆ విషయం ఇప్పుడు మినిట్ టు మినిట్ పరిశీలిద్దాం!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ప్రకటన అనంతరం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి "మేమంతా సిద్ధం" అంటూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. శనివారం కృష్ణాజిల్లా విజయవాడలో ఈ యాత్ర చేపట్టారు. ఈ సమయంలో రాత్రి రాత్రి 8:10 గంటల సమయంలో విజయవాడలోని సింగ్‌ నగర్‌ డాబా కొట్ల సెంటర్‌ వద్దకు చేరుకోగానే ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు!

ఇందులో భాగంగా... ముఖ్యమంత్రి జగన్‌ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. ఈ క్రమంలో... ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్‌ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పైభాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఇదే సమయంలో ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది.

దీంతో... 8:30 గంటల సమయంలో ముఖ్యమంత్రి తాను ప్రయాణిస్తున్న బస్సులోనే ప్రథమచికిత్స చేయించుకున్నారు. అక్కడితో బాసు యాత్రకు బ్రేక్ ఇస్తారని అంతా భావించారు. సున్నితమైన భాగం కావడంతో జగన్ నొప్పిని పంటికింద బిగపట్టి ప్రజలకు అభివాదం చేసిన అనంతరం చికిత్స తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది!

అలా 20 నిమిషాల పాటు ప్రథమ చికిత్స జగిన అనంతరం 8:50 గంటల తర్వాత తిరిగి జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ సమయంలో బస్సులో నుంచే ప్రజలకు అభివాదం చేస్తూ మూందుకు కదిలారు. ఇలా దాడి తర్వాత మరో 20 కి.మీ వరుకు బస్సు యాత్ర కొనసాగించారు జగన్. ఈ సమయంలో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో కేసరపల్లి క్యాంప్‌ నకు చేరుకున్నారు.

అనంతరం అక్కడ నుంచి బయలుదేరి రాత్రి 11:15 గంటల ప్రాంతంలో కేసరపల్లి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో... విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ప్రారంభమైంది. వైద్యుల సూచనల మేరకు జగన్ కు తగిలిన గాయానికి కుట్లు వేశారు వైద్యులు! ఈ క్రమంలో అర్ధరాత్రి 12:10 గంటల ప్రాంతంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన జగన్.. అర్ధరాత్రి 12:20 ప్రాంతంలో ఆసుపత్రి నుంచి కేసరపల్లి క్యాంప్‌ నకు తిరుగు ప్రయాణమయ్యారు!

ఇక సీఎం జగన్‌ పై హత్యాయత్నం కేసులో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో... కుట్రపూరితంగానే దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారని అంటున్నారు. ఈ క్రమంలో... రెండు లొకేషన్స్ నుంచి ఈ దాడి జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

ఇందులో భాగంగా... వివేకానంద స్కూల్ కు, గంగానమ్మ గుడికి మధ్య నుండి రాయితో దాడి చేసి ఉండొచ్చని అనుమానం.. మరో వైపు వివేకానంద స్కూల్ లోపల నుంచే దాడి చేసి ఉండొచ్చని మరో సందేహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. పైగా జగన్ పై దాడి జరిగిన సమయంలో వివేకానంద స్కూల్ లోని కొన్ని కిటికీలు తెరుచుకుని ఉన్నాయని.. వాటి నుండి ఎయిర్ గన్స్ తో క్యాటర్ బాల్‌ తో దాడి చేసి ఉండొచ్చని సందేహాలు తెరపైకి వస్తున్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News