పోర్న్ స్టార్ కేసులో దోషిగా తేలిన ట్రంప్‌... నాలుగేళ్ల జైలు శిక్ష?

అవును... పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్‌ తో అక్రమ సంబంధం కేసులో ట్రంప్ పై నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లు తాజాగా న్యూయార్క్ కోర్టు తేల్చింది.

Update: 2024-05-31 04:24 GMT

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ తీవ్ర ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... పోర్న్ స్టార్ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దోషిగా తేలారు. ఈ మేరకు న్యూయార్క్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దీంతో ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలవడం గమనార్హం.

అవును... పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్‌ తో అక్రమ సంబంధం కేసులో ట్రంప్ పై నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లు తాజాగా న్యూయార్క్ కోర్టు తేల్చింది. ఇందులో భాగంగా సుమారు 34 అంశాల్లో ఆయనను దోషిగా నిర్ధారించింది. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

స్టార్మీ డేనియల్‌ తో ట్రంప్‌ గతంలో 'ఏకాంతంగా' గడిపారనే ఆరోపణలు ట్రంప్ పై ఉన్న సంగతి తెలిసిందే. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ వ్యవహారంపై ఆమె నోరు విప్పకుండా ఆమెకు ట్రంప్‌ పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పారని అభియోగాల్లో పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా ఆమెకు పెద్దమొత్తంలో సొమ్ము ఇప్పించారని తెలిపారు.

ఇదే సమయంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారనే అభియోగాలు మోపబడ్డాయి. దీనికోసం బిజినెస్‌ రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై అభియోగాలు నమోదవ్వగా.. తాజాగా అవన్నీ నిజమేనని తాజాగా కోర్టు తేల్చింది.

ఇదే సమయంలో... ట్రంప్‌ తో తనకు అక్రమ సంబంధం ఉన్న మాట వాస్తవమేనని స్టార్మీ డేనియల్స్‌ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కేసు ట్రంప్ కు చుట్టుకోవడం దాదాపు కన్ ఫాం అనే కామెంట్ళు గతంలోనే వినిపించిన పరిస్థితి. అయితే ఆ కామెంట్లకు బలం చేకూరుస్తూ అన్నట్లుగా న్యూయార్క్ కోర్టు తాజాగా చారిత్రాత్మక తీపు వెలువరించింది!

ట్రంప్ జైలుకి వెళ్లాల్సిందేనా..?:

స్టార్మీ డేనియల్ కేసులో ట్రంప్ దోషిగా తేలడంతో ఒక కీలక ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. ఇందులో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌ జైలుకు వెళ్లాల్సిందేనా అనేది ఆ ప్రశ్న! అయితే... ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పలేమని అంటున్నారు నిపుణులు. బిజినెస్‌ రికార్డులు తారుమారు చేయడమనేది న్యూయార్క్‌ లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారని చెబుతున్నారు.

ఈ నేరానికి గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందని.. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యూయమూర్తిదే అని.. కచ్చితంగా జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్పలేమని అక్కడి న్యాయ నిపుణులు వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ అంశాన్నీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి జులై 11న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

మరోపక్క కోర్టు జూలై 11న శిక్ష ఖరారు చేసిన తర్వాత.. తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పుపై ట్రంప్‌ పై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని అంటున్నారు. దీనికోసం ఇప్పటికే ఆయన న్యాయవాదుల బృందం పనులు ప్రారంభించిందని చెబుతున్నారు. ట్రంప్ మాత్రం తనన్ను దోషిగా తేల్చడం అవమానకరమంటూ తీర్పును కొట్టిపారేశారు.

Tags:    

Similar News