బ్రిటన్ లో చదువు మరింత భారం... భారతీయులపై ఎంత ప్రభావం?
దీంతో... ఉన్నత విద్య కోసం వెళ్లే విదేశీ విద్యార్థులపై బ్రిటన్ ప్రభుత్వం మరింత భారం మోపినట్లయ్యింది.
బ్రిటన్ లో ఉన్నత చదువులు చదవాలనుకునే విదేశీ విద్యార్థుల నెలవారీ ఖర్చులకు అవసరమయ్యే నిధుల పరిమితిని యూకే పెంచింది. 2020 తర్వాత తొలిసారిగా బ్రిటన్ ఈ మొత్తాన్ని పెంచింది. దీంతో... ఉన్నత విద్య కోసం వెళ్లే విదేశీ విద్యార్థులపై బ్రిటన్ ప్రభుత్వం మరింత భారం మోపినట్లయ్యింది.
అవును... ఉన్నత చదువుల కోసం తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులు చదువు కొనసాగుతున్న సమయంలో తమ నెలవారీ ఖర్చులకు అవసరమయ్యే నిధుల పరిమితిని పెంచింది. ఈ మేరకు కోర్సు కొనసాగుతున్న సమయంలో ఈ మొత్తం సొమ్ము తమ వద్ద ఉందని చెప్పడానికి అవసరమైన ఆధారాలను చూపించాలని తెలిపింది.
ఇందులో భాగంగా... లండన్ లో ఉన్నత చదువు కోసం ప్లాన్ చేసుకుంటున్న వారు నెలకు 1,483 పౌండ్లు (1.64 లక్షల రూపాయలు) సేవింగ్స్ రూపంలో తమ అకౌంట్లో ఉన్నట్లు చూపించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ మొత్తం ప్రస్తుతం 1,334 పౌండ్లు (1.47 లక్షల రూపాయలు) గా ఉంది. అంటే... తాజాగా ఈ మొత్తాన్ని సుమారు 11శాతం పెంచారన్నమాట.
అంటే... తొమ్మిది నెలలు అంతకంటే ఎక్కువ కాలం లండన్ లో చదివేవారు మొత్తంగా సుమారు రూ.14.77 లక్షలు తమ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నట్లు చూపించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో లండన్ వెలుపల చదువుకునే వారికి నెలవారీ ఖర్చుల కోసం 1,136 పౌండ్లు (1.25 లక్షల రూపాయలు) గా నిర్దేశించింది. ప్రస్తుతం ఈ మొత్తం 1,023 పౌండ్లు (1.23 లక్షల రూపాయలు) గా ఉంది.
బ్రిటన్ లో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందీ కలగకూడదనే బ్రిటన్ ప్రభుత్వం ఈ నూతన నిబంధనలు రూపోందించిందని అంటున్నారు. ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి! ఈ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది!
ఈ వ్యవహారంపై స్పందించిన ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్, అభినవ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అజయ్ శర్మ... భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు ఓ మంచి కోర్సు లేదా సంస్థ కోసం ఏడాదికి సగటున రూ.25 లక్షలు ఖర్చు చేస్తారని.. అందువల్ల ఈ చిన్న మార్పులు విద్యార్థుల నిర్ణయాన్ని ప్రభావితం చేయవని అభిప్రాయపడ్డారు.