శ్రీవారి లడ్డూపై బాబు కుట్ర? స్వామి కొత్త సందేహాలివే!
తాజాగా ఆయన చంద్రబాబు కుట్ర కోణానికి సంబంధించిన కొత్త లాజిక్కులను తెర మీదకు తీసుకొచ్చారు.
యావత్ దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడటమే కాదు.. పెను సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన ఆవునెయ్యిలో జంతు కొవ్వులతో తయారు చేసినట్లుగా ఆరోపణలు చేయటం.. అది కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి రావటంతో షాకింగ్ గా మారింది. దీనిపై ఇప్పటికే బోలెడన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ ఎపిసోడ్ మీద కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు ప్రముఖ న్యాయవాది.. మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. తాజాగా ఆయన చంద్రబాబు కుట్ర కోణానికి సంబంధించిన కొత్త లాజిక్కులను తెర మీదకు తీసుకొచ్చారు.
తాజాగా జాతీయ మీడియాకు ఆయనో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో కీలకమైన అంశాల్ని చూసినప్పుడు.. స్వామి వాదన.. చంద్రబాబు వ్యాఖ్యల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారని చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త తరహా కుట్ర కోణానికి తెర తీశారని ఆరోపించారు. ఇంతకూ స్వామి చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే..
- ఆవునెయ్యి శాంపిల్స్ పరీక్షలుచేసి.. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవటంతో వెనక్కు పంపించినట్లు టీటీడీ ఈవో రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. కల్తీ జరిగిందని సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు పదే పదే బహిరంగంగా ప్రకటించటం దేనికి నిదర్శనం?
- ఇలా ఆరోపణలు చేసిన తర్వాత దర్యాప్తునకు ఆదేశిస్తారా? నిజానిజాలను నిర్దారించుకోకుండా భక్తుల్లో అలజడిని క్రియేట్ చేసేందుకు ప్రయత్నించటం కుట్ర కోణం కాక మరేంటి?
- లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా సీఎమ్మే సెప్టెంబరు 18న బహిరంగంగా ఆరోపించారు. ఆ తర్వాత ప్రసాదం కల్తీపై దర్యాప్తు చేసేందుకు సిట్ ను నియమిస్తున్నట్లుగా అదే నెల 26న ప్రకటించారు. ఇలాంటి తీవ్రమైన ఆరోపనలు చేసేటప్పుడు సీఎం స్థాయిలో ఉన్న వారు అది నిజమా? కాదా? అని మొదటే దర్యాప్తు చేయించాలి కదా?
- ముందు ఆరోపణ చేసి తర్వాత సిట్ దర్యాప్తు అన్నారు. కల్తీపై దర్యాపతు కోసం ప్రభుత్వం సిట్ నియమించటం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనుకోవటం లేదు.
- జులైలో కల్తీ జరిగిందని చెప్పి.. ఇంతకాలం ఎందుకు సిట్ ను నియమించారు. గత ప్రభుత్వంపైనా.. నాటి ముఖ్యమంత్రి మీదా చాలా పెద్ద ఆరోపణలు చేశారు.
- జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి తిరుపతిలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారని ఒక ప్రణాళిక ప్రకారం ఆరోపణలు చేస్తూ వచ్చారు. తద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మత ముద్ర వేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.
- 2019లో సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశారు.
- ఒక క్రైస్తవుడిని టీటీడీ ఛైర్మన్ గా ఎలా నియమిస్తారని హిందూవాదులు అగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి గురించి తెలిసిన వారిని ఎవరిని అడిగినా ఆయన హిందువనే చెబుతారు.
- ఆయన 32 సార్లు మాల వేసుకొని శబరిమల వెళ్లి వచ్చారు. ఇంట్లో గోశాల నిర్వహిస్తూనే గోవులకు పూజ చేస్తున్నారు.
- లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిపోయిందని చంద్రబాబు పత్రికల్లో పతాక స్థాయిల్లో స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇందులో సుప్రీంకోర్టును సైతం కలవరపెట్టే అంశాలు చాలా ఉన్నాయి.
- జులైలో నెయ్యి శాంపిల్ తీసుకొని పరీక్ష చేశారని టీటీడీ రిపోర్టులో ఉంది. అందులో కల్తీ జరిగిందని కానీ.. చేపనెయ్యి.. కొవ్వు కలిసినట్లుగా ఎక్కడా లేదు. నెయ్యి నాణ్యత టీటీడీ ప్రమాణాలకు తగ్గట్లు లేని కారణంగా వెనక్కి పంపామనే ఉంది. ప్రసాదం తయారీకి పంపామని ఎక్కడా లేదు.
- ఒకరి గుర్తింపును.. ఎదుగుదలను రాజకీయంగా నాశనం చేసేందుకు తప్పుడు వార్తలను ప్రచారం చేసి ఏజెన్సీలు సైతం ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.