'వైసీపీకి మాజీ మంత్రి గుడ్ బై!'... క్లారిటీ ఇచ్చేశారు!

వైసీపీలో భవిష్యత్తుపై పూర్తి సందేహాలు నిండిన నేపథ్యంలో ఆమె ఈ మేరకు ఆలోచన చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి!

Update: 2024-10-25 05:37 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచీ వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు, కీలక నేతలు ఇప్పటికే పార్టీని వీడగా.. మరికొంతమంది క్యూ లో ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మాజీ మంత్రి వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి వితౌట్ గ్యాప్ దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... పలువురు సీనియర్లు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లగా.. మరికొంతమంది క్యూలో ఉన్నారని అంటున్నారు. దీనికి తోడు పార్టీ అధినేతకు ఇంటా బయటా సమస్యలు చుట్టుముడుతున్నాయని చెబుతున్నారు.

ఈ సమయంలో... మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత వైసీపీని వీడనున్నారంటూ ఓ వర్గం మీడియాలో కథనాలు హల్ చల్ చేశాయి! వైసీపీలో భవిష్యత్తుపై పూర్తి సందేహాలు నిండిన నేపథ్యంలో ఆమె ఈ మేరకు ఆలోచన చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి! సొషల్ మీడియాలోనూ ప్రచారం జరిగిన పరిస్థితి.

ఈ సమయంలో మాజీ మంత్రి, వైసీపీ నేత మేకతోటి సుచరిత స్పందించారు. ఇందులో భాగంగా తాను పార్టీ మారబోతున్నట్లు వస్తోన్న ప్రచారాన్ని ఖండించారు. ఈ సందర్భంగా... వైఎస్ జగన్ తోనే చివరి వరకూ తమ ప్రయాణం కొనసాగుతుందని మాజీ హోంమంత్రి సుచరిత, రిటైర్డ్ ఐఆరెస్ అధికారి మేకతోటి దయాసాగర్ స్పష్టం చేశారు.

కొన్ని మీడియా ఛానళ్లు కనీసం తమను ఏమాత్రం సంప్రదించకుండా కావాలని ఇలాంటి ప్రచారానికి పాల్పడుతున్నారని స్పందించారు! తమపై పలు టీవీ ఛానళ్లలో వస్తోన్న ఊహాగాణాలు అన్నీ పూర్తి అవాస్తవమని.. గతంలో కూడా తాము టీడీపీలో చేరుతునట్లు ప్రచారం జరిగిందని.. తాము వైసీపీలోనే కొనసాగుతామని అప్పుడు స్పష్టం చేశామని అన్నారు.

ఇదే సమయంలో... తాము వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతోనే రాజకీయాల్లోకి వచ్చామని.. ఆయన మరణానంతరం వైసీపీలో చేరి, నాటి నుంచి నేటి వరకూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్నామని సుచరిత తెలిపారు! దీంతో... ఈ ప్రచారానికి తెరపడినట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News