విమానంలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు?
అతడు ఆత్మహత్య చేసుకోవడానికి విమానమే దొరికిందా? ఏకంగా విమానంలోనే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు.
అతడు ఆత్మహత్య చేసుకోవడానికి విమానమే దొరికిందా? ఏకంగా విమానంలోనే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. చివరకు దొరికిపోయాడు. బాత్ రూంలో ఆత్మహత్యకు ప్రయత్నించగా సిబ్బంది గమనించి అతడిని పట్టుకున్నారు. కొన ఊపిరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం.
తైవాన్ కు చెందిన ఇవా ఎయిర్ లైన్స్ విమానంలో గాలిలో ఉండగానే ఓ ప్రయాణికులు బాత్ రూంలోకి వెళ్లాడు. ఎంతకీ రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి తలుపు తెరిచి చూడగా అతడు ఆత్మహత్య చేసుకోవాలని గుర్తించారు. వెంటనే అత్యవసరంగా ల్యాండింగ్ చేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతడికి చికిత్స అందిస్తున్నారు.
బ్యాంకాగ్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో ఇలా ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తితో విమానం మధ్యలోనే ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. హిత్తూ ఎయిర్ పోర్టులో విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ తో ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది. కానీ అతడి ప్రాణాలు కాపాడే క్రమంలో విమనాన్ని మధ్యలోనే ఆపాల్సి రావడం జరిగింది.
చైనా పక్కన ఉండే చిన్న దేశం తైవాన్. జనాభా కూడా తక్కువే. డ్రాగన్ ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలని పలుమార్లు యత్నించింది. దీంతో తైవాన్ కు అమెరికా అండగా నిలిచింది. ఒక దశలో తైవాన్ తమ భూభాగమని డ్రాగన్ పలుమార్లు ప్రకటించింది. అమెరికా అడ్డుకోవడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు తైవాన్ లో జరిగిన సంఘటనతో వెలుగులోకి రావడం విశేషం.