కాంగ్రెస్ లో కనుగోలు సర్వే కలకలం
ఆఖరుకు హైదరాబాద్ లోని తన ఇంటి సమీపంలో ఉన్న జూబ్లీహిల్స్ పెద్దమతల్లి మీద కూడా ఓట్టేశాడు.
ఆగస్ట్ 15 లోపు ఖచ్చితంగా తెలంగాణలో రూ.2 లక్షల రుణమాఫి గ్యారంటీగా చేస్తాం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే దేవుళ్ల మీద ఒట్లేస్తున్నాడు. అలంపూర్ నుండి ఆదిలాబాద్ బాసర సరస్వతీ మాత దాకా, భద్రాచలం నుండి మెదక్ చర్చి, ఏడుపాయల దుర్గా భవాని మాత వరకు ఒట్టేయని దేవుడు లేడు. ఆఖరుకు హైదరాబాద్ లోని తన ఇంటి సమీపంలో ఉన్న జూబ్లీహిల్స్ పెద్దమతల్లి మీద కూడా ఓట్టేశాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒట్టేయడానికి ఏవైనా దేవుళ్లు, చర్చిలు, దర్గాలు ఉన్నాయా ? అన్న చర్చ నడుస్తుంది.
అసలు రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో పదే పదే ఎక్కడిక్కడ స్థానిక దేవుళ్ల మీద ఒట్టేయడానికి కారణం ఏంటి అంటే ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జరిపిన సర్వేలో రైతులు, యువత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్చట్లు తెలుస్తుంది.
అందుకే హఠాత్తుగా రేవంత్ సునీల్ కనుగోలు సూచనల మేరకు రైతులు, యువతను ఎలాగైనా ఆకట్టుకోవాలని పదే పదో రుణమాఫీ గురించి దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నాడు అని తెలుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు తెలంగాణలో సర్వే నిర్వహించారు.
ఈ సర్వేలో కాంగ్రెస్ మీద ఈ వర్గాలలో తీవ్ర వ్యతిరేకతను గుర్తించినట్లు తెలుస్తున్నది. ఎలాగైనా దీనిని అధిగమిణచాలన్న ఉద్దేశంతో ఏ దేవున్నీ వదలకుండా ఒట్లేస్తున్నట్లు సమాచారం. ఏదో ప్రచారంలో భాగంగా ఒకచోట ఓటేస్తే సరి. కానీ నిలబడ్డ ప్రతి చోట కనిపించిన ప్రతి గుడిలోని దేవుడి మీద ఓటేయడం మూలంగానే రేవంత్ లోని డొల్లతనం బయటపెడుతుందని అంటున్నారు.