జగన్ ఛానల్లో డిబేట్‌ చేద్దామంటున్న సునీత... సంచలన వ్యాఖ్యలు!

వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కడప, హైదరాబాద్ లలో స్పందించిన వైఎస్ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి... తాజాగా అమరావతిలో మరోసారి స్పందించారు.

Update: 2024-04-02 07:52 GMT

"మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ కడపలో పర్యటించిన నేపథ్యంలో... మరోసారి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన చర్చ మరింత బలంగా సాగుతోంది. ఇందులో భాగంగా చిన్నాన్న వైఎస్ వివేకాను ఎవరు చంపారనేది పైనున్న దేవుడికి, వివేకాకు, కడప ప్రజలకు తెలుసని.. చంపిన వారు బయట దర్జాగా తిరుగుతున్నారని జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ విషయంపై ఇప్పటికే స్పందించిన నర్రెడ్డి సునీత.. మరోసారి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్... వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసని ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కడప, హైదరాబాద్ లలో స్పందించిన వైఎస్ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి... తాజాగా అమరావతిలో మరోసారి స్పందించారు.

ఇందులో భాగంగా... వైఎస్ వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసని చెబుతున్నారు.. అలాంటప్పుడు మీరు కూడా ఆ జిల్లా ప్రజల్లో ఒకరు కదా.. అంటే వివేకాను ఎవరు హత్య చేశారో, ఎవరు చేయించారో కూడా మీకు తెలిసినట్లే కదా అని జగన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు సునీత. తెలిసినప్పుడు ప్రజలక్ చెప్పాలి కదా అని అన్నారు.

"ఒక కడప జిల్లా వాసిగా ఈ విషయం తెలిసినప్పుడు ఎందుకు బయటపెట్టడం లేదు.. ఆ విషయం వెల్లడించాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉంది కదా? అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? అతని ప్రమేయం గురించి తెలిస్తే ఇంకేమైనా బయటపడతాయనే భయపడుతున్నారా?" అని జగన్ ని ప్రశ్నించిన సునీత... “నాతో నేరుగా మాట్లాడాలంటే మీ ఛానల్ కి వస్తాను.. డిబేట్ చేద్దాం.. నిజానిజాలు బయటకు వస్తాయి” అని వ్యాఖ్యానించారు.

ఇదే క్రమంలో... వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ప్రజలు అంతా గ్రహిస్తున్నారని.. వాస్తవాలు ఏమిటో వారికి తెలుసని.. కడప, హైదరాబాద్ లలో తాను అడిగిన ప్రశ్నలకు ఒక అన్నగా కాకపోయినా.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా సమాధానం చెప్పాలని సునీత డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తన హత్యను ఎన్నికల్లో జగన్ వాడుకున్నారని.. ఐదేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు మరోసారి ఆ ప్రయత్నాలకు తెరతీశారని అన్నారు.

Tags:    

Similar News