ఐ.ఎస్.ఎస్.లో ఎమర్జెన్సీ... సునీతా విలియమ్స్ ఎక్కడంటే..?
దీంతో... ఇటీవల స్పేస్ కు వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ లు బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో తలదాచుకోవాల్సి వచ్చింది.
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పేస్ లోనే ఉన్న సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఆమె భూమికి ఎప్పుడు వస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రావట్లేదు! ఇదే సమయంలో నాసా నుంచి కూడా ఆమె తిరుగు ప్రయాణంపై స్పష్టమైన ప్రకటన రావడం లేదని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే.... ఇటీవల కొద్దిసేపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎమర్జెన్సీ నెలకొంది! ఈ విషయం వైరల్ గా మారింది.
అవును... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.)లో ఇటీవల కొద్ది సమయం ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో... ఇటీవల స్పేస్ కు వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ లు బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో తలదాచుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అత్యంత సమీపంలో భారీగా ఉపగ్రహ వ్యర్థాలు రావడమే అని అంటున్నారు.
వాస్తవానికి బుధవారం ఐ.ఎస్.ఎస్.కు దగ్గరగా ఓ ఉపగ్రహం శకలాలు వచ్చినట్లు నాసా గుర్తించిందట. దీంతో... ఈ సమాచారాన్ని వెంటనే అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు చేరవేసింది. దీంతో... అలర్ట్ అయిన వ్యోమగాములు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సిబ్బంది మొత్తాన్ని వారికి సంబంధించిన స్పేస్ క్రాఫ్ట్ ల్లోకి వెళ్లిపోయావాలని ఆదేశాలు జారీచేశారు.
దీనికి సంబంధించిన సమస్య సుమారు గంట సేపు ఉందని చెబుతున్నారు. ఐతే... ఆ తర్వాత ముప్పులేదని నిర్ధారించుకుని వ్యోమగాములకు క్లియరెన్స్ ఇచ్చారని అంటున్నారు. ఈ ఎమర్జెన్సీకి కారణమైన ఉగ్రహం... రష్యాకు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం రిస్యూర్స్ - 1 గా చెబుతున్నారు. రెండేళ్ల క్రితమే నిరుపయోగంగా మారిన ఇది బుధవారం సుమారు 100కు పైగా ముక్కలుగా విడిపోయి.. ఐ.ఎస్.ఎస్.కు అత్యంత సమీపంలోనే ఈ ఉపగ్రహ శకలాలు సంచరించాయని చెబుతున్నారు.
మరోపక్క సునీత విలియమ్స్, బుల్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో భూమిచుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు. వీరిరువురూ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లి దాదాపు రెండు వారాలు గడిచినా.. వారి తిరుగు ప్రయాణంపై క్లారిటీ రావడం లేదు. వాస్తవానికి వీరు ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తర్వాత జూన్ 14న భూమిపైకి రావాల్సి ఉంది. అయితే ఇంకా పరిశోధనలు మిగిలి ఉండటంతో రిటన్ డేట్ ను జూన్ 26కు మార్చారు.
అప్పటికీ క్లారిటీ రాకపవడంతో... వీరి తిరుగు ప్రయాణంపై తీవ్ర చర్చ జరుగుతుంది. కాగా... సునీత విలియమ్స్ కు ఇది మూడో అంతరిక్ష యాత్ర కాగా... 1998లో నాసాకు ఎంపికైన ఆమె తొలిసారిగా 2006లో రోదసి యాత్ర చేశారు. ఆ తర్వాత 2012లో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఏడాది మూడోసారి స్పేస్ కి వెళ్లారు.