గంటన్నరలో లండన్ టు న్యూయార్క్... ఈ సూపర్ విమానం కథ వేరే లెవెల్!

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత గ్లోబల్ టెక్ పవర్ హౌస్ గా, ఆవిష్కరణలకు కేంద్రంగా పేరు సంపాదించుకున్న దేశం చైనా.

Update: 2024-11-02 08:30 GMT

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత గ్లోబల్ టెక్ పవర్ హౌస్ గా, ఆవిష్కరణలకు కేంద్రంగా పేరు సంపాదించుకున్న దేశం చైనా. అలాంటి దేశం తాజాగా ఓ ప్యాసింజర్ విమానం ఫస్ట్ టెస్ట్ రన్ ను పూర్తి చేసింది. ఇది మాక్ 4 వేగంతో ప్రయాణించగలదని చెబుతున్నారు. ఈ విమానం కాకోర్డ్ కంటే రెండింతలు వేగంగా వెళ్లగలదని అంటున్నారు.

అవును.. చైనాకు చెందిన స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ అనే ఏరోస్పేస్ సంస్థ యున్ సింగ్ విమానం ప్రోటో టైపు ను ప్యాసింజర్ల కోసం తయారు చేసింది. ఈ సమయంలో దీని ఫస్ట్ టెస్ట్ సక్సెస్ ఫుల్ గా పూర్తైనట్లు ప్రకటించింది. ఇదే సమయంలో వచ్చే నవంబర్ లో ఇంజిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

1976 నుంచి 2003 వరకూ అందుబాటులో ఉన్న సూపర్ సోనిక్ ప్యాసెంజర్ ప్లేన్ "కాంకర్డ్" గరిష్ట వేగానికి దీని వేగం రెండితలు కంటే ఎక్కువని చెబుతున్నారు. అన్నీ అనుకూలంగా జరిగితే... 2027లో ప్రయాణికుల కోసం పూర్తిస్థాయి సూపర్ సోనిక్ జెట్ విమానాన్ని ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.

వాస్తవానికి ట్రాన్స్ అట్లాంటిక్ మార్గంలో అతివేగంతో ప్రయాణించడానికి సాధారణ విమానాలకు సుమారు 8 గంటల సమయం పట్టగా.. కాంకర్డ్ కు 2 గంటల 53 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇక ఈ కొత్త సూపర్ సోనిక్ జెట్ విషయానికొస్తే.. ఇది గంటకు 5 వేల కిలోమీటర్ల వేగంతో.. లండన్ నుంచి న్యూయార్క్ కు కేవలం గంటన్నరలో చేరుకోగలదని అంటున్నారు!

అన్నీ అనుకూలంగా జరిగితే... 2003లో కాంకర్డ్ చివరి ప్రయాణం తర్వాత సుమారు 25 ఏళ్ల అనంతరం 2027లో ప్రయాణికులను తీసుకెళ్లగలిగే మొదటి సూపర్ సోనిక్ ఎయిర్ లైన్స్ గా స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ అవతరించనుంది!

Tags:    

Similar News