కండెక్టర్ గా పని చేసిన బస్సు డిపోకు వెళ్లిన రజినీ... వీడియోవైరల్!

కాగా.. తన తాజా చిత్రం "జైలర్" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కర్నాటక వెళ్లిన రజినీకాంత్.. ఈ రోజు ఉదయం బెంగళూరులోని బీఎంటీ బస్ డిపోకు వెళ్లారు

Update: 2023-08-29 11:31 GMT

ఏ మనిషైనా గతం మరిచిపోకూడదు అంటారు. పునాదులు మరిచిపోని వ్యక్తి మనిషిగా చాలా ఎత్తులో ఉంటాడని చెబుతుంటారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ విషయంలో ఫస్ట్ వరుసలో ఉంటారని చెబుతుంటారు. దాన్ని నిజం చేస్తూ తాజాగా తన గత జీవితాన్న్ని గుర్తుచేసుకునే పనికి పూనుకున్నారు రజనీ.

అవును... సూప‌ర్‌ స్టార్ రజినీకాంత్ ఇవాళ బెంగుళూరులోని బీఎంటీసీ బ‌స్ డిపోను ఆక‌స్మికంగా సందర్శించారు. బెంగుళూరు మెట్రోపాలిట‌న్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేష‌న్ డిపో నెంబ‌ర్ 4లో ఆయ‌న కాసేపు గడిపారు. ఇందులో భాగంగా.. అక్క‌డి ఉద్యోగుల‌తో కాసేపు ముచ్చటించారు. సినీ ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందు ర‌జినీకాంత్ బెంగుళూరులో బ‌స్ కండ‌క్ట‌ర్‌ గా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే.

కాగా.. తన తాజా చిత్రం "జైలర్" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కర్నాటక వెళ్లిన రజినీకాంత్.. ఈ రోజు ఉదయం బెంగళూరులోని బీఎంటీ బస్ డిపోకు వెళ్లారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడెన్ గా ఆ బస్సు డిపోలోకి వెళ్లారు. రజినీకాంత్ రాకతో డిపోలోని బస్సు డ్రైవర్లు, కండెక్టర్లు, ఇతర కార్మికులు షాక్ అయ్యారు.

ఈ సందర్భంగా అక్కడున్న అందరితోనూ రజనీ మాట్లాడారు. అవును... ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన సూపర్ స్టార్.. తన జీవితం ఇక్కడే మొదలైందని.. కండెక్టర్ గా ఈ డిపో నుంచే తన ప్రయాణం మొదలైందని అన్నారు.

అనంతరం... ఈ డిపోలోని బస్సులోనే కండెక్టర్ గా పని చేస్తూ సినిమాల్లోకి వెళ్లినట్లు తెలిపారు. అందుకే ఈ బస్సు డిపో అంటే తనకు ఎప్పుడూ ప్రత్యేకం అని, తన జీవితానికి అన్నీ ఇచ్చింది, స్టార్ డమ్ ఇచ్చింది ఈ డిపోనే అంటూ బావోద్వేగానికి గురయ్యారు రజినీకాంత్.

ఇదే సమయంలో బస్సు డిపోలోని ప్రతి ఒక్కరితో ముచ్చటించిన రజినీకాంత్.. అడిగిన వాళ్లందరికీ ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు. గత జ్ణాపకాలతో రజనీకాంత్ ఎమోషనల్ అయ్యారని కార్మికులు తెలిపారు. రజినీకాంత్ బస్సు డిపోకు వచ్చారన్న విషయం తెలుసుకున్న బయట అభిమానులు సైతం.. పెద్ద సంఖ్యలో డిపో దగ్గరకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News