ఇది కరెక్ట్ కాదు మినిస్టర్

వివాదాల మీదనే రాజకీయాలు సాగుతున్నాయా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

Update: 2024-10-02 17:07 GMT

రాజకీయాలు ఇపుడు సవ్యంగా సాగడం లేదు. నాయకులు వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. తద్వారా పబ్లిక్ అటెన్షన్ కి గెయిన్ చేయాలని చూస్తున్నారు. వివాదాల మీదనే రాజకీయాలు సాగుతున్నాయా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

తెలంగాణాలో మంత్రి కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట మంచి కంటెంట్ ని అందిస్తే అందించవచ్చు కానీ ఇలాగ కూడా కామెంట్స్ చేస్తారా అన్న చర్చకు తెర లేస్తోంది. నిజానికి చూస్తే కనుక ఇలా ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఒకరి వ్యక్తిగత జీవితంలోకి ఎలా వెళ్తారు అన్న చర్చ కూడా ఉంది.

కేవలం రాజకీయం కోసం వ్యక్తిగత జీవితంలోకి చొరబడతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, క్షంతవ్యం కూడా కాదు మినిస్టర్ అని అంటున్నారు. చూస్తే ఈ కామెంట్స్ చేసింది మహిళా మంత్రి కొండా సురేఖ.

ఆమెకు ఫైర్ బ్రాండ్ అని పేరు ఉంది కానీ ఎపుడూ ఇలా వ్యక్తిగత ఆరోపణలు అయితే చేయలేదు. కానీ ఏమైందో ఏమో కానీ ఆమె నోరు జారారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేసీఆర్ వల్లనే సినీ నటి సమంతాకు విడాకులు వచ్చాయని, ఎందరో హీరోయిన్లు కూడా మధ్యలో తన ప్రొఫెషన్ వదిలేసి వెళ్ళిపోయారు అని ఆమె చేసిన ఆరోపణల వెనక ఏమైనా ఆధారాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది.

అసలు సురేఖ చేసిన వ్యాఖ్యలను ఎంతవరకూ సమర్ధిస్తారు అన్నది కూడా ఉందిపుడు. ఇదే సోషల్ మీడియాలో ట్రెండ్ గా సాగుతోంది. అయితే అత్యధికులు మాత్రం ఇది మంచిది కాదనే అంటున్నారు నిజానికి సురేఖ చేసిన ఈ వ్యాఖ్యల లక్ష్యం కేటీఆర్ అయితే మధ్యలో మరో మహిళ సమంత కూడా ఉందని ఆమెను అకారణంగా బాధితురాలిని చేస్తున్నామన్న ఆలోచన లేకపోతే ఎలా అని కూడా అంటున్నారు.

పైగా బాధ్యతాయుతమైన పదవిలో సురేఖ ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఇక ఆమె చేసిన ఈ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ వస్తోంది. అయితే బీఆర్ఎస్ నేతలు ఆమె మీద దారుణంగా ట్రోలింగ్ చేశారు అని ఆమె ఇటీవల్నే కన్నీరు పెట్టుకున్నారు. దానికి ప్రతిగా ఆమె ఈ రకంగా వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ కూడా ఉంది.

ఇక్కడ చిత్రమేంటి అంటే ఎవరు ఏమి అన్నా ఏ విమర్శలు చేసినా మధ్యలో బలి అవుతోంది మహిళలే అన్నది ఎందుకు గుర్తించలేకపోతున్నారు అన్నదే. అటు సమంత అయినా ఇటు సురేఖ అయినా కూడా బాధితులే అయినపుడు మరి ఎవరి మీద వేసిన బాణం ఎవరికి తగులుతోంది అన్న చర్చ కూడా ఉంది. మొత్తం మీద సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే దుమారాన్నే రేపుతున్నాయని భావించాలి.

Tags:    

Similar News