పవన్ కే షాక్ ఇచ్చిన అధికారులు!?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరసబెట్టి తన శాఖల మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయన తాజాగా స్వచ్చాంధ్ర కార్పోరేషన్ మీద రివ్యూ చేపట్టారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరసబెట్టి తన శాఖల మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయన తాజాగా స్వచ్చాంధ్ర కార్పోరేషన్ మీద రివ్యూ చేపట్టారు. ఈ రివ్యూ సాగుతూండగా అధికారులను పవన్ నిధులు ఎన్ని ఉన్నాయని అడిగారు. దానికి వారు ఇచ్చిన సమాధానం తో పవన్ షాక్ తిన్నారు.
జస్ట్ ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్పడంతో పవన్ సీరియస్ అయ్యారు. ఆయనకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూపిస్తూ ఈ విధంగా అధికారులు చెప్పడంతో పవన్ అసలు నిధులు అన్నీ ఏమయ్యాయని నిలదీశారు. కేంద్రం నుంచి ఏకంగా గడచిన అయిదేళ్ళలో 1066 కోట్ల రూపాయలు విడుదల చేసింది కదా వాటి సంగతి ఏమైంది అని పవన్ ప్రశ్నించారు.
ఇక 2021లో 2092 కోట్ల రూపాయల మేర నిధులు ఉంటే అవన్నీ ఏమయ్యాయని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత భారీ ఎత్తున నిధుల మళ్ళింపు ఎలా జరిగింది అన్నది డిప్యూటీ సీఎం కే అర్ధం కాని పరిస్థితి అని అంటున్నారు. అసలు కార్పొరేషన్ నిధులు ఎటు మళ్ళించారు అని ఆయన అధికారులను గట్టిగానే ప్రశ్నించారని భోగట్టా.
అంతే కాదు నిధుల మళ్ళింపు మీద సమగ్రమైన నివేదికను తయారు చేసి ఇవ్వాలని అక్కడికక్కడ పవన్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే ఈ ఏడు వేల కోట్లు దేనికి పనిని వస్తాయీ అంటే అయిదు నెలల పాటు ఉద్యోగుల జీతాలకు అని అంటున్నారు. అందువల్ల వాటిని ముట్టుకోవడానికి లేదు. మరి ఇంతటి కార్పొరేషన్ ద్వారా ఏ విధంగా పనులు చేయించుకోవాలి ఏ విధంగా ముందుకు సాగాలి అన్నది మాత్రం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కి అర్ధం కావడం లేదు అని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు పూర్తిగా దారి మళ్ళాయని ఈ రివ్యూలో పవన్ గ్రహించారు అని అంటున్నారు. మరి దాని మీద నివేదిక వచ్చాక సీరియస్ యాక్షన్ వైపు గానే పవన్ ఉన్నరని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ధర్మాగ్రహానికి గురి అయ్యేది ఎవరు అన్నదే ఇక్కడ చర్చ.