అమిత్ షా తనతో ఏం మాట్లాడింది క్లారిటీ ఇచ్చిన తమిళ సై
ఆ రోజున అసలేం జరిగిందన్న విషయాన్ని ఆమె చెబుతూ.. ‘ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశాను.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన సమయంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై తో బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా సీరియస్ కావటం.. ఆమెను పిలిచి మరీ క్లాస్ పీకినట్లుగా సదరు సీన్ ను టీవీల్లో చూసిన వారికి మాత్రమే కాదు.. దీనికి సంబంధించిన వీడియోను చూసినోళ్లంతా సమ్ థింగ్ ఈజ్ రాంగ్ అన్న భావనకు గురి కావటం తెలిసిందే. దీనికి తోడు తమిళనాడు బీజేపీలో చోటు చేసుకున్ పరిణామాల నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడినట్లుగా చెప్పాలి.
తమిళ సైను అలా బహిరంగ వేదిక మీద.. పిలిచి మరీ అమిత్ షా క్లాస్ పీకిన వైనంపై పెద్ద ఎత్తున అంచనాలు.. ఊహాగానాలు వ్యక్తం కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ సై స్పందించారు. వేదిక మీద తనను పిలిచిన అమిత్ షా తనకేం చెప్పారన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు తమిళ సై. తమ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఊహాగానాల్ని కొట్టేసిన ఆమె.. జరిగింది వేరైతే.. తప్పుగా అర్థం చేసుకున్నారంటూ అసలేం జరిగిందంటే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఆ రోజున అసలేం జరిగిందన్న విషయాన్ని ఆమె చెబుతూ.. ‘ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశాను. పోలింగ్ తర్వాత సమీకరణాలు.. ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకునేందుకు అమిత్ షా నన్ను పిలిచారు. నేను ఆయనకు వివరిస్తున్నప్పుడు సమయాభావాన్నిపరిగణలోకి తీసుకొని ఆయన మాట్లాడారు. రాజకీయ..నియోజకవర్గ కార్యక్రమాల్నిముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారు. ఆ మాటలు నాకెంతో భరోసా కలిగించాయి. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుంది’’ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. తమిళ సై ఇస్తున్న స్పష్టత ఏ మాత్రం సంత్రప్తికరంగా లేదన్న మాట వినిపిస్తోంది.