తమిళనాడులో 'మంచిదొంగ'!

సెల్వన్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇంటికి వచ్చి తనిఖీ చేస్తుండగా దొంగ విడిచిపెట్టిన క్షమాపణ లేఖ కనిపించింది.

Update: 2024-07-04 10:30 GMT

"నన్ను క్షమించండి. మీ వస్తువులను మీకు నెల రోజుల్లో అప్పజెబుతాను. మా ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చింది"తమిళనాడులోని మేగ్నానపురంలోని సాతంకుళం రోడ్డులో ఓ ఇంటిని దోచుకున్న దొంగ విడిచిపెట్టి వెళ్లిన లేఖ పేర్కొన్న విషయం ఇది.

సెల్వన్, ఆయన భార్య ఇద్దరూ పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు. జూన్ 17న చెన్నైలో ఉంటున్న తమ కుమారుడిని చూసేందుకు వెళ్లారు. అయితే, తాము లేనప్పుడు ఇంటిని నిత్యం శుభ్రం చేసేందుకు సెల్వీ అనే పని మనిషిని పెట్టుకున్నారు.

జూన్ 26న ఇంటిని క్లీన్ చేసేందుకు వెళ్లిన సెల్వీ తలుపులు తెరిచి ఉండడం చూసి వెంటనే ఆమె ఇంటి యజమాని సెల్వన్‌కు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే వచ్చిన ఆయన ఇంట్లో దొంగలు పడినట్టు గుర్తించి రూ. 60 వేల నగదు, 12 గ్రాముల బంగారు నగలు, వెండిపట్టీలు దోచుకెళ్లినట్టు నిర్ధారించుకున్నారు.

సెల్వన్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇంటికి వచ్చి తనిఖీ చేస్తుండగా దొంగ విడిచిపెట్టిన క్షమాపణ లేఖ కనిపించింది. తనను క్షమించాలని, దోచుకున్న వస్తువులను నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని దొంగ ఆ లేఖలో హామీ ఇవ్వడం విశేషం.

Tags:    

Similar News

eac