టార్గెట్ ఉత్త‌రాంధ్ర‌.. వైసీపీ వ్యూహం ఇదే...!

అదేస‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత కూడా ఈ జిల్లాల్లో జ‌న‌సేన కార్య‌క్ర మాలు పుంజుకున్నాయి.

Update: 2023-12-16 16:30 GMT

వ‌చ్చేఎన్నిక‌ల‌ను భారీ యుద్ధంగా భావిస్తున్న వైసీపీ.. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తోంది. ప్రాంతాల వారీగా ఉన్న ఓటు బ్యాంకుల‌తో త‌మ‌కు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును మ‌రింత పెంచుకునేందు కు, అదేస‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల ఓటు బ్యాంకును, సానుభూతిని కూడా సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గిం చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఉత్త‌రాంధ్ర‌పై వైసీపీ ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెంచింది. నేటి నుంచి మూడు రోజుల పాటు.. ఇక్క‌డ వైసీపీ యాత్ర‌లు చేయ‌నుంది.

ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం ఉమ్మ‌డి జిల్లాల్లో టీడీపీ బ‌ల‌మైన ప్ర‌స్థానంతో ముందు కు సాగుతోంది. అదేస‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత కూడా ఈ జిల్లాల్లో జ‌న‌సేన కార్య‌క్ర మాలు పుంజుకున్నాయి. పార్టీ గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండానే జ‌న‌సేన శ్రీకాకుళం, విజ‌య న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నాల్లో భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. తర‌చుగా ప‌వ‌న్ ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు.

ప‌లితంగా జ‌న‌సేన కూడా ఉత్త‌రాంధ్ర‌లో పుంజుకుంది. ఇక‌, టీడీపీ కొన్ని ద‌శాబ్దాలుగా ఇక్క‌డ అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసింది. అయితే.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో పాద‌యాత్ర ప్ర‌భావం కావొచ్చు.. ఒక్క ఛాన్స్ అనే సానుభూతి వ‌ల్ల‌కావొచ్చు వైసీపీ మెజారిటీ స్థానాల్లో ఉత్త‌రాంధ్ర‌లో గెలుపు గుర్రం ఎక్కింది. ఈ నే ప‌థ్యంలో ఇప్పుడు ఉత్త‌రాంధ్ర పై టీడీపీ, జ‌న‌సేన‌లు అంతకంటే ఎక్కువ వ్యూహంతోనే ముందుకు సాగుతున్నాయి. త‌మ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు స్థానాల‌ను ప‌దిలం చేసుకునేందుకు ప్ర‌య త్నిస్తున్నాయి.

దీనిని గ‌మ‌నించిన వైసీపీ.. విశాఖ‌ను రాజ‌ధానిగా చేస్తామ‌న్న ప్ర‌క‌ట‌న‌ను మ‌రింత తీవ్రంగా ప్ర‌జ‌ల్లోకి తీసు కువెళ్ల‌డంతోపాటు.. శ్రీకాకుళంలోని ఉద్దానంలో నిర్మించిన కిడ్నీ ఆసుప‌త్రి, స‌హా భోగాపురం పోర్టు.. వంటి కీల‌క అంశాల‌పై మ‌రింత తీవ్ర‌మైన ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించింది ఈ క్ర‌మంలోనే శ‌నివారం నుంచి మూడు జిల్లాల్లోనూ పార్టీ ఉత్త‌రాంధ్ర జిల్లాల ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో యాత్ర‌లు చేయ‌నున్నారు. మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే ఈ కార్య‌క్ర‌మాన్ని పార్టీ అధిష్టానం నేరుగా ప‌ర్య‌వేక్షించ‌నుంది కూడా! మ‌రి ఎంత వ‌ర‌కు స‌ఫ‌ల‌మ‌వుతుందో చూడాలి.

Tags:    

Similar News