గుడ్ న్యూస్... చినబాబు చెబుతానన్న పెద్ద ప్రకటన ఇదే!

ఏపీ మంత్రి నారా లోకేష్.. టాటా సన్స్ బోర్డ్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో మంగళవారం (అక్టోబర్ 8) భేటీ అయిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-09 14:31 GMT

ఏపీ మంత్రి నారా లోకేష్.. టాటా సన్స్ బోర్డ్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో మంగళవారం (అక్టోబర్ 8) భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఎక్స్ లో పోస్ట్ చేసిన లోకేష్... ఈ సమావేశం అద్భుతంగా జరిగిందని.. బుధవారం (అక్టోబర్ 9)న ఓ భారీ ప్రకటన కోసం వేచి చూడాలంటూ ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఆ భారీ ప్రకటన వెల్లడించారు.

అవును... టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రశేఖరన్ తో రెండోసారి భేటీ అయ్యారు నారా లోకేష్. ఆగస్టు 16న సీఎం చంద్రబాబును కలిసేందుకు సెక్రటేరియట్ కు వచ్చిన చంద్రశేఖరన్ తో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలొనే రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలతో పాటు ప్రోత్సాహకాల గురించి వివరించారు.

ఇందులో భాగంగా... ఏపీలో ప్రధానంగా ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, రెన్యువబుల్ ఎనర్జీ, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, టెలీ కమ్యునికేషన్ మొదలైన రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ఉన్న అని వనరులను వివరించి.. పెట్టుబడులు పెట్టాలని కోరారు! ఈ క్రమంలోనే గుడ్ న్యూస్ ప్రకటించారు లొకేష్.

ఇందులో భాగంగా... టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) లిమిటెడ్ కంపెనీ విశాఖకు రాబోతుందని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దీని ద్వారా 10,000 మందికి ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడంలో ఇదో మైలురాయని మంత్రి పేర్కొన్నారు.

Tags:    

Similar News