ఆరు నెల‌ల కూట‌మి పాల‌న‌పై జ‌నం ఏం తేల్చారంటే.. !

ప్ర‌జ‌లు త‌మ ప్ర‌భుత్వం గురించి.. పాల‌న గురించి.. ఎలాంటి అభిప్రాయంతో ఉన్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న కూపీ లాగారు. ఆర్టీజీఎస్ స‌మావేశంలో అధికారులు ఈ విష‌యాల‌ను వివ‌రించారు.

Update: 2025-01-29 09:30 GMT

రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పార్టీల కూట‌మి పాల‌న ప్రారంభ‌మై.. ఆరు మాసాలు పూర్త‌యింది. ఇంకో మాట‌లో చెప్పాలంటే.. ఏడు నెల‌లు పూర్త‌య్యాయి. అయితే.. వ‌ర‌ద‌లు, అకాల వ‌ర్షాలు వంటి కొన్ని రోజు లు తీసేస్తే.. ఖ‌చ్చితంగా ఆరుమాసాల స‌మ‌యం రాష్ట్ర ప్ర‌భుత్వానికి ల‌భించింది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు ఈ ప్ర‌భుత్వంపై ఎలాంటి ఆలోచ‌న చేస్తున్నారు? ఎలా స్పందిస్తున్నార‌నేది ఆస‌క్తిగా మారింది. దీనిపై అంద‌రిక‌న్నా ముందుగా.. సీఎం చంద్ర‌బాబు ఉత్సాహంతో ఉన్నారు.

ప్ర‌జ‌లు త‌మ ప్ర‌భుత్వం గురించి.. పాల‌న గురించి.. ఎలాంటి అభిప్రాయంతో ఉన్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న కూపీ లాగారు. ఆర్టీజీఎస్ స‌మావేశంలో అధికారులు ఈ విష‌యాల‌ను వివ‌రించారు. ఐవీఆర్ ఎస్ స‌ర్వే ద్వారా.. ర్యాండ‌మ్‌ గా ప్ర‌జ‌ల నుంచి తెలుసుకున్న అభిప్రాయాల‌ను ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. దీని ప్ర‌కారం.. మెజారిటీ ప్ర‌జ‌లు సూప‌ర్ సిక్స్ హామీల‌పై ప్ర‌శ్నించారు. మ‌హిళ‌లు ముఖ్యంగా ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణాల‌పై ఆశ‌లు పెట్టుకున్నట్టు స్ప‌ష్టంగా స‌ర్కారుకు అర్ధ‌మైంది.

ఇదే స‌మ‌యంలో ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు ఉంటే.. వారికి రూ.15 వేల చొప్పున ఇస్తామ‌న్న మాతృవం ద‌నంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌శ్న‌లు సంధించారు. పింఛ‌న్ల విష‌యంలో సంతృప్తి ఉన్నా.. క‌మీష‌న్లు, లంచాలు.. ఉచిత ఇసుకవిక్ర‌యాలు, బెల్టు షాపులు, ఎమ్మెల్యేల లంచావ‌త‌రాలు, అధికారుల అవినీతి.. వంటివాటిని మెజారిటీగా ప్ర‌జ‌లు ప్ర‌శ్నించారు. ఆయా విష‌యాల‌న్నీ.. అంత‌ర్గ‌తంగా చంద్ర‌బాబుకు చేరిపోయాయి. ఇప్ప‌టికే అనేక సార్లు ఎమ్మెల్యేల‌ను ఈ విష‌యంలో ఆయ‌న హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే.

మ‌రోవైపు.. వైసీపీ చాప‌కింద నీరులా .. జ‌గ‌న్ ఉంటే.. అనే నినాదాన్ని ప్ర‌చారం చేస్తుండ‌డంతో గ్రామీణ ప్రాంతాల్లో జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ పెరుగుతున్న‌ట్టు అధికారులు స్ప‌ష్టం చేశారు. మ‌రీ ముఖ్యంగా.. ఆరు మాసాల వ‌ర‌కు అంతా బాగానే ఉంద‌ని.. కానీ, ఇప్పుడు ఏడో నెల ప్రారంభం కావ‌డం.. స‌ర్కారు నుంచి ఆశించిన విధంగా ప‌థ‌కాలు అమ‌లు కావ‌డం లేద‌న్న చ‌ర్చ ప్ర‌జ‌ల మ‌ధ్య నెల‌కొంద‌ని అధికారులు స్ప‌స్టం చేశారు. ఇక‌, నిరుద్యోగ యువ‌త కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌న్న విష‌యాన్ని కూడా ఆర్టీజీఎస్ అధికారులు స్ప‌ష్టం చేశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే హుటాహుటిన చంద్ర‌బాబు మీడియా మీటింగ్ పెట్ట‌డం.. గ‌మ‌నార్హం.

Tags:    

Similar News