టీడీపీలో 'శ్రావ‌ణ' మేఘాలు తొలిగేదెన్న‌డు.. !

కిడారి శ్రావణ్ కుమార్. యువ నాయకుడు. ఎస్టి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత.

Update: 2024-10-21 04:48 GMT

కిడారి శ్రావణ్ కుమార్. యువ నాయకుడు. ఎస్టి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. అయితే ఆయనఇప్పుడు ప్రభావం కోల్పోయారు. తండ్రి కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు దార‌ణంగా హత్య చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన కిడారి శ్రావణ్ కుమార్.. వచ్చి రావడంతోనే మంత్రి అయ్యారు. 2018 చివరిలో ఎన్నికలకు ముందు ఆయనను మంత్రిని చేశారు. అలాగే బలమైన భద్రతను కూడా కల్పించారు. ఈ క్రమంలోనే 2019లో అరకు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు.

కానీ, డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఇక ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయనకు అసలు అవకాశం ద‌క్క‌లేదు. అర‌కు అసెంబ్లీ స్థానాన్ని కూట‌మిలో భాగంగా బీజేపీ నేత‌.. పంగి రాజారావుకు ఇచ్చారు. ఆయ‌న ఓడిపోయారు. దీంతో ఆయ‌న కాకుండా కిడారికి ఇచ్చి ఉంటే గెలిచి ఉండేవార‌న్న చ‌ర్చ ఉంది. ఇదిలావుంటే.. ఇప్పుడు కిడారి శ్రావణ్‌ కుమార్ చంద్రబాబు అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ ప‌ద‌వైన ఇవ్వకపోతారా అని తన అనుచ‌రుల‌తో చెబుతున్నారు.

ఫస్ట్ ఈ సామాజిక వర్గాన్ని బలోపేతం చేయడంతో పాటు అరకులో ఎస్టీ సామాజిక వర్గాన్ని టిడిపి వైపు తిప్పుకునేందుకు ఉన్న ఏకైక అవకాశం కిడారి శ్రావణ్ కుమార్ ను బలోపేతం చేయడం అనే చ‌ర్చ కూడా సాగుతోంది. అయితే, ఈ విషయంలో చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, వైసీపీ దూకుడు నేపథ్యంలో ఇప్పుడు తనకు ఏదో ఒక పదవి ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవని శ్రావణ్ కుమార్ చెబుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఉన్న మంత్రి నారా లోకేష్ ను కలుసుకున్నారు.

ఆయనతోనూ ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. తనకు ఏదో ఒక పదవిని ఇవ్వాలని నియోజకవర్గంలో పార్టీని బలవపేతం చేస్తానని ఆయన విన్నవించారు. కాగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని చెప్పడం గమనార్హం. అయితే ఈ ఏడాది ఎన్నికల్లో అసలు టికెట్ ఇవ్వకపోవడంతో కిడారి వర్గం ఆవేదంలో ఉంది. మరి ఇప్పుడైనా ఆ కుటుంబానికి న్యాయం చేస్తారా లేక ఇంకా వెయిట్ చేయాలా అనేది చూడాలి. యువ నాయకుడిగా నారా లోకేష్ వర్గంగా ఒకప్పుడు గుర్తింపు పొందిన శ్రావణ్ కుమార్.. ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండడం పార్టీలో ప్రాధాన్యం లేకపోవడం ఆయనకు ప్రజల్లోకి వెళ్లేందుకు ఇబ్బందిగానే మారిందని చెప్పాలి.

Tags:    

Similar News