టీడీపీ చేతికి కమలాపురం మున్సిపాలిటీ.. రవీంద్రనాథ్ కు భారీ షాక్

కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ కంట్రోల్ చేసే కమలాపురం మున్సిపాలిటీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Update: 2024-10-08 04:18 GMT

అధికారంలో ఏ పార్టీ ఉంటే.. అందుకు తగ్గట్లుగా సమీకరణాలు మారిపోవటం ఇటీవల కాలంలో చూస్తున్నదే. రాష్ట్ర పగ్గాలకు తగ్గట్లే.. స్థానికంగా కూడా అధికార బదిలీ సాగుతోంది. తాజాగా అలాంటి పరిస్థితే కమలాపురం మున్సిపాలిటీలోనూ చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనమామగా సుపరిచితులు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ కంట్రోల్ చేసే కమలాపురం మున్సిపాలిటీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు పగ్గాలున్న వైసీపీ నుంచి టీడీపీకి అధికారం బదిలీ అయ్యింది.

ఇంతకాలం పురపాలక ఛైర్మన్ గా ఉన్న మర్పూరి మేరీ.. కౌన్సిలర్లు షేక్ నూరి.. రాజేశ్వరి.. సలీల.. నాగమణిలు టీడీపీలో చేరటంతో ఇప్పటివరకు వైసీపీ అధిక్యతలో ఉన్న కమలాపురంలో సమీకరణాలు మారిపోయాయి. దీనికితోడు కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగిన నేపథ్యంలో పరిస్థితులు.. పరిణామాలు మారిన పరిస్థితి. ఈ పరిణామాలతో టీడీపీ బలం పదికి చేరితే.. వైసీపీ బలం ఎనిమిదికి పరిమితమైంది. దీంతో.. కమలాపురం మున్సిపాలిటీ టీడీపీ చేతుల్లోకి వెళ్లిపోవటం ఖాయమంగా మారింది. త్వరలోనే పురపాలక సర్వసభ్య సమావేశం త్వరలోనే జరుగుతుందని.. ఆ లోపు వైసీపీకి చెందిన మరికొందరు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

మరోవైపు కమలాపురాన్ని మున్సిపాలిటీగా ఉంచాలా? పంచాయితీగా ఉంచాలా? అన్న దానిపైనా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా త్వరలోనే మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి.. అందులో ఈ విషయాన్ని తేల్చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా అధికార బదిలీకి తగ్గట్లే కమలాపురంలో పరిస్థితులు మారుతున్నట్లుగా చెప్పాలి. ఇంతకాలం రవీంద్రనాథ్ కనుసన్నల్లో నడిచిన కమలాపురం మున్సిపాలిటీలో ఇప్పుడు కొత్త గాలి వీస్తుందని చెప్పక తప్పదు. ఈ పరిణామాలు రవీంద్రనాథ్ కు షాకిచ్చేలా మారాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News