మొన్న ట్విట్టర్.. నేడు యూట్యూబ్.. టీడీపీ అధికారిక ఛానల్ హ్యాక్!
ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీకి హ్యాకర్స్ నుంచి సమస్యలు తప్పడంలేనట్లున్నాయనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.
ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీకి హ్యాకర్స్ నుంచి సమస్యలు తప్పడంలేనట్లున్నాయనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవ్వగా... నేడు తాజాగా తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ ఛానల్ యాక్ అయిందని చెబుతున్నారు.
అవును... తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ కు గురైంది. బుధవారం ఉదయం నుంచి ఈ ఛానల్ లో అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు. ఈ సమయంలో... ఎవరు హ్యాక్ చేశారు అనే విషయాన్ని గుర్తించేపనిలో టీడీపీ ఐటీ వింగ్ ఉందని అంటున్నారు. పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇదే సమయంలో... దీనిపై యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ఛానల్ ఓపెన్ చేసిన వారికి స్ట్రక్ అయినట్లు చూపిస్తుందని అంటున్నారు.
కాగా... 2022 అక్టోబర్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కి గురైన సంగతి తెలిసిందే. దీని స్థానంలో అప్పట్లో "టైలర్ హాబ్స్" అనే పేరు ప్రత్యక్షం అవ్వడంతో హ్యాక్ గు గురైనట్లు గుర్తించామని పార్టీ వర్గాలూ వెల్లడించాయి. నాడు.. దీనిపై అధికార వైసీపీపై పార్టీ శ్రేణులు ఆరోపణలు చేశాయి!
ఈ నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవ్వడం సంచలనంగా మారింది. మరి.. దీన్ని ఎప్పటిలోగా పునరుద్దరిస్తారనేది వేచి చూడాలి.