రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు అన్న టీడీపీ ..!
శనివారం ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ జరిగిన భేటీలో పొత్తు కుదిరింది అని ఆయన కీలక స్టేట్మెంట్ ఇచ్చారు.
కేంద్రంలో బీజేపీ ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తాయని రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికే ఈ పొత్తులు అని టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ వెల్లడించారు. శనివారం ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ జరిగిన భేటీలో పొత్తు కుదిరింది అని ఆయన కీలక స్టేట్మెంట్ ఇచ్చారు.
మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది 2024 ఎన్నికల్లో ఏపీలో కలసి పోటీ చేయాలని నిర్ణయించాయని చెప్పారు. సీట్ల సర్దుబాటు విషయానికి సంబంధించి త్వరలోనే మూడు పార్టీల నేతలూ సమావేశం అవుతారు అని ఆయన వెల్లడించారు. పార్టీల బలాబలాలు బట్టి స్థానాలపైన నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. ఇక బీజేపీ జనసేన పోటీ చేయగా మిగిలిన సీట్లలో టీడీపీ పోటీ చేస్తుందని ఆయన వివరించారు.
కనకమేడల ఈ విషయం చెప్పడంతో కూటమిలోకి బీజేపీ చేరిక అన్నది అఫీషియల్ గా ఖరారు అయింది అని అంటున్నారు. ఇప్పటికి రెండు సార్లు అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ అయినా మీడియాకు మాత్రం కనిపించలేదు వారితో మాట్లాడలేదు. దాంతో ఏమిటి జరుగుతోంది అన్న చర్చ అయితే బయల్దేరింది.
దానిని పక్కకు పెట్టేలా కనకమేడల స్టేట్మెంట్ ఉందని అంటున్నారు. ఆయన ఇచ్చిన ఈ ప్రకటనతో పొత్తులు ఖాయమని అంటున్నారు. సీట్ల సర్దుబాటు గురించి కూడా ఆయన చెప్పారు. అలాగే పార్టీల బలాబలాలను బట్టే సీట్లు అని కూడా పేర్కొన్నారు. దాంతో ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగా జనసేన బీజేపీకి 30 అసెంబ్లీ ఎనిమిది ఎంపీ సీట్లు ఇవ్వడం ఖాయమని అంటున్నారు.
అదే విధంగా ఎక్కడ ఏ పార్టీ పోటీ చేయాలి. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలి అన్న చర్చలే ఇపుడు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మూడు రోజులుగా ఢిల్లీగా చంద్రబాబు పవన్ మకాం వేసి మరీ అమిత్ షాతో జరిపిన చర్చలు అయితే ఒక కొలిక్కి వచ్చినట్లుగానే అంతా భావిస్తున్నారు.