వయసు గురించి ఫస్ట్ టైం ఓపెన్ అయిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు వయసు ఏడున్నర పదులు ముసలివారని సీఎం జగన్ తన ప్రసంగాలలో అంటూంటారు

Update: 2023-08-02 09:31 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు వయసు ఏడున్నర పదులు ముసలివారని సీఎం జగన్ తన ప్రసంగాలలో అంటూంటారు. బాబు ఏజ్ బార్ అయింది అని కూడా వైసీపీ నేతలు తరచూ కామెంట్స్ చేస్తూంటారు. దాని మీద చంద్రబాబు చాలా సార్లు బయటకు పెద్దగా చెప్పకపోయినా పార్టీ వారి చేత కౌంటర్లు ఇప్పించేవారు.

కానీ ఆయన ఫస్ట్ టైం మాత్రం ఓపెన్ అయిపోయారు. మాట్లాడితే ముఖ్యమంత్రి జగన్ తన వయసు గురించి ప్రస్థావిస్తారని, కానీ తాను నవ యువకుడినే అని ఏకంగా జగన్ సొంత జిల్లాలోనే చంద్రబాబు బిగ్ సౌండ్ చేశారు. నా ఏజ్ గురించి వైసీపీ నేతలకు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నేను రోజుకు 18 గంటలు పనిచేస్తాను, జగన్ ఒక్క గంట అయినా తనలా పనిచేయగలరా అంటూ నంద్యాల సభలో చంద్రబాబు సవాల్ చేశారు.

నేను కష్టపడతాను . ఏపీ గురించి ఎంతో తపిస్తున్న నాయకుడిని అంటూ బాబు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఏపీని మరో ఇరవై ఏళ్ళ తరువాత ఎలా ఉండాలో కూడా తన దగ్గర ఆలోచనలు ఉన్నాయని అన్నారు. తాను తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క కేసు కూడా పెట్టించుకోలేదని, తన మీద ఏ మరకా లేదని చంద్రబాబు చెప్పుకున్నారు.

నేను సింహం గా బతుకుతున్నాను, నేను శాశ్వతంగా సింహంగానే ఉంటాను అంటూ ఆయన గంభీరమైన ప్రకటనలే చేశారు. అంటే బాబు రాజకీయ ప్రత్యర్ధుల మీద కేసులు మచ్చలు ఉన్నాయని ఆయన ఇండైరెక్ట్ గానే జనాలకు తెలిసేలా చెప్పారని అంటున్నారు. అలాగే వయసుతో సంబంధం ఏముంద్, తాను ఈ రోజుకీ పద్దెనిమిది గంటలు కష్టపడతాను అని పనిమంతుడికే జనాలు ఓక్టు వేయాలని బాబు సరికొత్తగా పిలుపు ఇచ్చారు అని అంటున్నారు.

తాను రౌడీలకు సింహ స్వప్నంగా ఉంటాని, ఎవరైనా రౌడీ వేషాలు వేస్తే వారి తాట తీస్తానని కూడా బాబు హెచ్చరించారు. ఇదివరకు బాబు కాదని, తాను కఠినంగా ఉంటానని చెప్పారు. తాను కచ్చితంగా ఏపీ బాగు కోసమే మరింత సమయం పనిచేస్తాను అని కూడా చంద్రబాబు అంటున్నారు.

ఏపీని ఎలా బాగు చేయాలో తనకు తప్ప ఎవరికీ తెలియదు అని తన అనుభవం అంతా 2024 నుంచి ఏర్పడబోయే టీడీపీ ప్రభుత్వంలో చూపిస్తాను అని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే చంద్రబాబు ఏజ్ బాధను నంద్యాల సభలో బయటపెట్టారు. కష్తపడేవారికి వయసు ఉంటుందా అని నిలదీశారు. తాను ప్రజల కోసం పనిచేస్తాను అంటే వైసీపీ నేతలకు ఎందుకు ఉలుకు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

మరి ముసలాయన అంటూ తన మీద తన వయసుతో పాటు క్యారక్టర్ మీద జగన్ విమర్శలు చేస్తున్నారు అని బాబు బాధపడుతూనే గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మరి బాబు సంధించిన ప్రశ్నలు చూస్తే తాను ఎప్పటికీ యూత్ అనే అంటున్నారు. జనాలు ఆయన మాటలను విని అట్రాక్ట్ అవుతారా జగన్ ఆయన మీద చేస్తున్న ఏజ్ బార్ కామెంట్స్ ని జనాలు లైట్ తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News