చంద్రబాబు హామీల వరద.. తమ్ముళ్లదే ఆలస్యం.. !
ఇప్పుడు చంద్రబాబు మరోసారి వచ్చే ఎన్నికల్లో విజయాన్ని తన భుజాలపైనే వేసుకున్నారు
''నేను చేయాల్సింది నేను చేస్తున్నా. ఇక, మీరే తేల్చుకోవాలి.'' - ఇదీ.. టీడీపీ నాయకులకు పార్టీ అధినే తగా చంద్రబాబు చెప్పే మాట. అంటే.. ప్రజల మధ్యలో ఉండాలని.. ప్రజలకు మరింత చేరువ కావాలని.. వారి ఆకాంక్షలకు అద్దంపట్టేలా వ్యవహరించాలని కూడా చంద్రబాబు సూచనలు చేస్తున్నారు. అయితే.. కొందరు పాటిస్తున్నారు. మరికొందరు పెడచెవిన పెడుతున్నారు.
ఇక, ఇప్పుడు చంద్రబాబు మరోసారి వచ్చే ఎన్నికల్లో విజయాన్ని తన భుజాలపైనే వేసుకున్నారు. 2014, 2019 ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు సర్వం తానే అయి.. ఎన్నికలను నడిపించారు. ప్రజలకు ఆయనే చేరువయ్యారు. వారికి అనేక హామీలు గుప్పించారు. ఇక, ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ చేస్తున్నా రు. మొత్తం ఎన్నికల్లో గెలుపు భారం అంతా కూడా.. చంద్రబాబు తన భుజాలపైనే వేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆయన స్వయంగా ప్రజలకు కొన్ని హామీలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో సీఎం జగన్‌కు సవాళ్లపై సవాళ్లు రువ్వుతున్నారు. దమ్ముంటే గడపగడపకు ఇద్దరం కలిసి తిరుగుదాం. రా! అంటూ.. తాజాగా జగన్‌కు సవాల్ రువ్వారు. ఇదేసమయంలో ప్రజలపై హామీల వరద కురిపిస్తున్నారు. అంటే.. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో చంద్రబాబు దూకుడు మరింత పెరిగిందనే చెప్పాలి.
ఈ క్రమంలో ఇప్పుడు మేలుకోవాల్సింది తమ్ముళ్లే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు నారా చం ద్రబాబు వచ్చినప్పుడో.. నారా లోకేష్ వచ్చినప్పుడో.. ప్రజల మధ్యకు వస్తున్నవారు.. ఎక్కువగానే ఉన్నా రు. వారు అటు వెళ్లగానే ఇటు సొంత పనుల్లో నాయకులు బిజీ అవుతున్నారు. ఇలాంటి వారిని పార్టీలోని ఐటీడీపీ పక్కాగా గుర్తిస్తున్నట్టు తెలుస్తోంది. నాయకులకు తెలియకుండా.. షాడో బృందం ఒకటి.. ఫాలో అయి.. సంబంధిత సమాచారాన్ని చంద్రబాబుకు చేరవేస్తోంది. దీనిని బట్టి టికెట్లపై నిర్ణయం ఉండనుంది.