‘బాలీవుడ్ హీరోయిన్ ని బంధిస్తారా’?... జగన్ పై ప్రశ్నల వర్షం!

అనంతరం వారిని బెదిరించి, భయపెట్టి ఇకపై పెళ్లి మాట ఎత్తబోమంటూ వారితో బలవంతంగా సంతకాలు చేయించి పంపించారని చెబుతున్నారు.

Update: 2024-08-27 08:15 GMT

గత ప్రభుత్వ హయాంలో కొంతమంది వైసీపీ నేతలు, మరికొంతమంది అధికారులతో కలిసి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయంటూ... ముంబైకి చెందిన ఓ సినీనటితో కృష్ణాజిల్లా వైసీపీ నేత సాగించిన వ్యవహారం అంటూ ఓ ఇష్యూ ఈ రోజు ప్రధాన మీడియా సంస్థలు తాటికాయంత హెడ్డింగులతో పబ్లిష్ చేసిన ఒక కథనం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇందులో భాగంగా కృష్ణాజిల్లాకు చెందిన వైసీపీ నేత ఒకరు.. ముంబై కి చెందిన సినీనటిని ప్రేమపేరుతో లొంగదీసుకున్నారని.. అనంతరం పెళ్లి చేసుకోకుండా మోసగించారని.. నాడు తమకున్న అధికార బలాన్ని ఉపయోగించి బాధితురాలితో పాటు ఆమె తల్లితండ్రులపైనా అక్రమ కేసులుపెట్టి జైలుకు పంపించారని చెబుతున్నారు.

అనంతరం వారిని బెదిరించి, భయపెట్టి ఇకపై పెళ్లి మాట ఎత్తబోమంటూ వారితో బలవంతంగా సంతకాలు చేయించి పంపించారని చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు పలువురు పోలీసు అధికారుల హస్తం ఉందని ప్రముఖ మీడియా సంస్థలు పబ్లిష్ చేసిన కధనాలు చూస్తే తెలుస్తుంది . . ఈ నేపథ్యంలో టీడీపీ స్పందించింది.

అవును... ముంబై కి చెందిన ఓ నటిని కృష్ణాజిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత ప్రేమ పేరుతో లొంగదీసుకుని.. అనంతరం పెళ్లి చేసుకోవాలని కోరితే వేధింపులకు పాల్పడ్డాడని వస్తున్న కథనాలపై టీడీపీ స్పందించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించింది. బాలీవుడ్ నటిని బంధించి వేధిస్తారా జగన్ అంటూ ఎక్స్ వేదికగా వరుస పోస్టులు పెడుతుంది.

ఇందులో భాగంగా... బాలీవుడ్ హీరోయిన్ కోసం నీ సలహాదారుడితో కలిసి ఏకంగా అధికార యంత్రాంగాన్ని వాడుకుంటారా? జగన్ అంటూ ప్రశ్నించిన టీడీపీ... ప్రత్యేక విమానాలు వేసుకుని మరీ, ఆ బాలీవుడ్ హీరోయిన్ ని విజయవాడకు తీసుకుని వస్తారా..?, ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో బంధించి, ఆమెను వేధిస్తారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

ఇదే క్రమంలో... ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది ఇలాంటి పనులు చేయడానికా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించిన టీడీపీ... బెంగళూరులో అసలు నువ్వు ఏమి చేస్తున్నావు జగన్.. సమాధానం చెప్పు అంటూ టీడీపీ ఓ పోస్ట్ పెట్టింది. దీనికి జగన్, సజ్జల కలిసి ఉన్న సెల్ఫీ పిక్ ను షేర్ చేసింది.

Tags:    

Similar News