రెండు ఎమ్మెల్సీ పదవులు.. అయితే వారికి కాదు!

ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూటమికే దక్కనున్నాయి.

Update: 2024-07-02 05:40 GMT

ఆం్ర«దప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక మళ్లీ ఎన్నికలకు తెరలేచింది. శాసన మండలిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూలై 12న ఈ రెండు స్థానాలకు ఎన్నిక జరగనుంది.

ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఎందుకంటే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యే కోటా స్థానాలు. ఎమ్మెల్యేలు వీరిని ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో 164 సభ్యుల బలం కూటమికి ఉంది. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూటమి ఖాతాలో పడనున్నాయి.

కాగా రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ, జనసేన పంచుకున్నాయి. టీడీపీ తరఫున రాయలసీమ నేత, మాజీ ఎంపీ సి.రామచంద్రయ్య, జనసేన తరఫున డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత కార్యదర్శి పిడుగు హరిప్రసాద్‌ ను అభ్యర్థులుగా ఎంపిక చేశారు.

సి.రామచంద్రయ్య ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉన్నారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఇక హరిప్రసాద్‌ కు ఇదే మొదటిసారి పదవి అవుతుంది.

వాస్తవానికి రెండు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉంటూ టీడీపీలోకి రావడంతో అనర్హత వేటుకు గురై పదవులు కోల్పోయిన డొక్కా మాణిక్యవరప్రసాద్, మహ్మద్‌ ఇక్బాల్‌ కు ఇస్తారని టాక్‌ నడిచింది. ముఖ్యంగా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ గెలుపులో కీలక పాత్ర పోషించిన మహ్మద్‌ ఇక్బాల్‌ కు ఇస్తారని అనుకున్నారు. అయితే అనూహ్యంగా చర్చల్లో లేని సి.రామచంద్రయ్య, హరిప్రసాద్‌ లను ఎంపిక చేశారు.

Read more!

అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పేరు కూడా ముందు వినిపించింది. కూటమి అభ్యర్థుల తరపున మొన్నటి ఎన్నికల్లో రాధా ప్రచారం నిర్వహించారు. దీంతో ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి మంత్రిని చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా సి.రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను దక్కించుకున్నారు.

వీరిద్దరి ఎన్నిక లాంఛనప్రాయమే. ఎందుకంటే అసెంబ్లీలో వైసీపీకి బలం లేదు. కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రెండు ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలు ఓట్లేయాల్సి ఉంటుంది. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి టీడీపీకి, మరొకటి జనసేనకు దక్కనుంది,

Tags:    

Similar News