హిందూపురంలో టీడీపీ 'ఒకవైపే' చూస్తోందా?
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం హిందూపురం. ఇక్కడ నుంచి టీడీపీ నాయకు డు, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలయ్య వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం హిందూపురం. ఇక్కడ నుంచి టీడీపీ నాయకు డు, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలయ్య వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్నా రు. ఇక, ముచ్చటగా మూడో సారి కూడా.. ఇక్కడ నుంచే ఆయన పోటీ చేయనున్నారు. అయితే.. ఈసారి ఆయన గెలుపు అంత ఈజీకాదనే సంకేతాలు వస్తున్నాయి. నిజానికి గత 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోర పరాజయం పొందిన 23 స్థానాల్లో విజయం దక్కించుకుంది.
వాటిలో హిందూపురం కూడా ఉంది. దీంతో తమకు తిరుగులేదని.. బాలయ్య ఇమేజ్ ఇక్కడ విజయం దక్కించి తీరుతుందని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. ఆయన అలా అనుకోవడం తప్పుకాదు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే.. మాత్రం బాలయ్య ఇమేజ్‌కు డ్యామేజీ చేసేలా వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని వైసీపీ నిర్దేశించుకున్న నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఉంది.
దీనికి తగినట్టుగానే వైసీపీ ఇక్కడ మండలాల వారీగా కూడా నాయకులను నియమించింది. అదేసమ యంలో అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెడుతూ.. దీపిక అనే మహానాయకురాలికి పగ్గాలు అప్పగించిం ది. అందరూ కలసి కట్టుగా పనిచేయాలని కూడా సీఎం జగన్ చెబుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా మహ్మద్ ఇక్బాల్ విజయం దక్కించుకోలేక పోయారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక, టికెట్ ఆశించిన నవీన్ నిశ్చల్‌కు నామినేటెడ్ పదవిని అప్పగించారు.
ఇప్పుడు అసలు విషయానికివస్తే.. వైసీపీ ఇక్కడ నాయకులను ఫుల్ రీచార్జ్ చేసింది. మొత్తంగా ఒక నియోజకవర్గం కోసం.. ముగ్గురు కీలక నాయకులను(ఇక్బాల్-నవీన్-దీపిక) నియమించడంతోపాటు.. మండలస్థాయిలోనూ.. నాయకులను బలోపేతం చేసింది. మొత్తంగా పద్మవ్యూహాన్ని ఇక్కడ తలపించేలా వైసీపీ రాజకీయం చేస్తోంది. కానీ, దీనిని గమనించి కూడా టీడీపీ మాత్రం బాలయ్య ఇమేజ్‌నే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది.
ఇది ప్రమాదమేనని అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు మాత్రమే కాకుండా.. వైసీపీ చేస్తున్న వ్యూహాలకు ప్రతివ్యూహాలు కూడా రెడీ చేసుకోవాలని పరిశీలకులు సూచిస్తున్నారు.