వెలిగిన చోటే మిణుకుమంటూ... చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్న టీడీపీ లీడర్..!
పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్మే పరిస్థితి రావడం దారుణం. అలాగే.. ఒక వెలుగు వెలిగిన చోటే మిణుకు మిణుకు మంటూ.. వ్యవహరించడం.. కూడా నేతల విషయంలో అలానే ఉంటుంది.
పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్మే పరిస్థితి రావడం దారుణం. అలాగే.. ఒక వెలుగు వెలిగిన చోటే మిణుకు మిణుకు మంటూ.. వ్యవహరించడం.. కూడా నేతల విషయంలో అలానే ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు కీలక నాయకుల విషయాలు .. పార్టీలకు అతీతంగా చర్చకు వస్తున్నాయి. ఒకప్పుడు పోలింగ్‌ను, నియోజకవర్గాలను కూడా శాసించిన నాయకులు చాలా మంది ఉన్నారు.
అయితే.. తర్వాత కాలంలో వారిలో చాలా మంది కనుమరుగైనా.. ఇప్పటికీ ఉన్నవారిలో కొందరు.. మిణు కు మిణుకు మంటున్నారనే వాదన వినిపిస్తోంది. వీరిలో వైసీపీలోనూ.. టీడీపీలోనూ నాయకులు ఉన్నార నే చర్చ సాగుతోంది. అదేసమయంలో కొందరు.. ఇతర పార్టీల్లోనూ ఉన్నారని అంటున్నారు. ఉదాహరణ కు ఒకప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తమకు తిరుగులేదని భావించిన కమ్యూనిస్టుల పరిస్తితి ఇప్పుడు కనీసం కనిపించడం లేదు.
ఇక, ప్రస్తుతం ఉన్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఒకప్పడు ఇక్కడ చక్రం తిప్పారు. తాను చేసిందే ఆదేశం అన్నట్టుగా వ్యవహరించారు. కానీ, వేసిన అడుగులు.. తీసుకున్న నిర్ణయాలు కూడా జలీల్‌ఖాన్‌ను మైనస్సుల్లోకి నెట్టాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొందరు నాయకుల పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు. వీరిలో రాయపాటి సాంబశివరావు కుటుంబం పరిస్థితి ఆదేశించిన స్థాయి నుంచి.. అర్థించే స్థాయికి దిగజారిపోయిందని అంటున్నారు.
ఇక, కడపలో డీఎల్ రవీంద్రారెడ్డి వంటివారి పరిస్థితి కూడా ఇలానే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఒకప్పుడు తమ సత్తా చాటిన వారు.. తామేంటో చూపించిన వారు.. ఇప్పుడు ఎన్నికల ముంగిట.. దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు. చిత్రం ఏంటంటే.. ప్రస్తు తం ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరి విషయంలోనూ.. పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు. మరి వీరికి ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా!! అనేది చూడాలి.